సంబంధిత వార్తలు
- ప్రేమ పేరుతో నమ్మించాడు.. భర్త నుంచి విడగొట్టాడు.. తన గదికి తీసుకొచ్చి నోట్లో పుగుల మందు తాపించాడు..
- మూడు నెలల్లోగా కొత్త రాజకీయ పార్టీ..ఫోన్ ట్యాపింగ్ కేసు సీరియల్‌గా కొనసాగుతోంది.. కవిత
- రాజమండ్రిలో పెద్దపులిని అలా పట్టేసిన అటవీ శాఖాధికారులు
- బాత్రూమ్లు శుభ్రం చేయడానికి ఉపయోగించే రసాయనాలతో చేసిన నెయ్యితో లడ్డూ చేశారు..
- తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. 336 స్థానాల్లో జనసేన పోటీ
మద్యం మత్తులో ప్రాణం తీసిన వ్యసనం.. సిగరెట్ సెగకు మాజీ సైనికుడు మృతి
హైదరాబాద్ నగరంలో హెచ్.ఎఫ్.నగర్‌లో శుక్రవారం సాయంత్రం ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తలో వెలిగించిన సిగరెట్, ఒక నిండు ప్రాణానాన్ని బలితీసుకుంది. మాజీ సైనికోద్యోగి ఏ.చెన్నకేశవులు (68) తన ఇంట్లోని పెంట్‌హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో సజీవ దహనమయ్యాడు.
1994లో సైన్యం నుంచి రిటైర్మెంట్ అయిన చెన్నకేశవులు తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు. అయితే, ఆయనకు మద్యం, సిగరెట్లు తాగే అలవాటు ఉంది. ఇంట్లో రెండో అతస్తులో ఉన్న పెంట్‌హౌస్‌ను తన వ్యక్తిగత గదిగా వాడుకుంటున్నాడు.
శుక్రవారం ఎప్పటిలాగే మద్యం సేవించిన ఆయన సిగరెట్ వెలిగించి అలాగే మత్తులోకి జారుకున్నాడు. ఆ సమయంలో సిగరెట్ రవ్వలు పడటంతో గదిలో సోఫా, పరుపులకు మంటలు అంటుకున్నాయి. దురదృష్టవశాత్తూ చెన్నకేశవులు కాళ్లు నొప్పులతో బాధపడుతుండటంతో, మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాడు.
పెంట్‌హౌస్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానిక యువకులు వెంటనే స్పందించి మంటలు అదుపులు చేసే ప్రయత్నం చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న బోరబండ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఎన్.ఆర్. నగర్ ఏపీసీ రాఘవేంద్ర రావు కేసును పర్యవేక్షిస్తున్నారు.
