సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By selvi
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2017 (17:37 IST)

కాంగ్రెస్‌లో రేవంత్ ఎంత? వాళ్లంతే: తలసాని శ్రీనివాస్ యాదవ్

తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకీ వేడెక్కుతున్నాయి. టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి పార్టీ మారుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విదేశాల్లో వున్న నేపథ్యంలో ఆయన స్వదేశానికి వస్తేనే రేవ

తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకీ వేడెక్కుతున్నాయి. టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి పార్టీ మారుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విదేశాల్లో వున్న నేపథ్యంలో ఆయన స్వదేశానికి వస్తేనే రేవంత్ రెడ్డి ఇష్యూకు తెరపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారనే ప్రచారంపై తెలంగాణ‌ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. అసలు తెలంగాణ‌ టీడీపీలో ఎంత మంది ఎమ్మెల్యేలున్నారని ఆయ‌న ఎద్దేవా చేశారు.
 
ఆ పార్టీలో ముగ్గురు ఎమ్మెల్యేలుంటే.. వారిలో ఒకరు మీడియాలో ఎప్పుడూ నిలవాలని చూస్తే.. ఇంకొకరు పైరవీలు చేస్తారని.. ఇక మూడో ఎమ్మెల్యే తన పార్టీనే పట్టించుకోరని తేల్చేశారు. కాంగ్రెస్‌ అనే మహా సముద్రంలో రేవంత్‌ ఎంత? అని తలసాని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు ఎలా ముందుకెళ్లాలో తెలియదని.. అసెంబ్లీ మాట్లాడే అవకాశం ఇచ్చినా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధమైనట్లు తలసాని ఎద్దేవా చేశారు.
 
ఏపీ ఆర్థికమంత్రి యనమలకు కాంట్రాక్టులు ఎక్కడిచ్చామో రేవంత్‌రెడ్డి చెప్పలేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. సీఎం పక్క రాష్ట్రానికి వెళ్లినప్పుడు నాయకులు మర్యాదపూర్వకంగా కలవడాన్ని తప్పుబట్టడం సరికాదని తలసాని అన్నారు. యనమల రామకృష్ణుడితో పాటు పరిటాల సునీత కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం నుండి కాంట్రాక్టులు దక్కాయని రేవంత్‌రెడ్డి తీవ్రమైన విమర్శలు చేశారు.