బుధవారం, 6 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 ఆగస్టు 2025 (13:36 IST)

నటి మీరా మిథున్ అరెస్టుకు కోర్టు ఆదేశాలు

meera mithun
బిగ్ బాస్ ఫేమ్, సినీ నటి మీరా మిథున్ అరెస్టుకు తమిళనాడులోని చెన్నై కోర్టు ఆదేశాలు జారీచేసింది. గతంలో ఆమె దళితులను కించపరిచేలా వ్యాఖ్యానించారు. ఈ అభియోగాలపై ఆమెపై కేసు నమోదైంది. దళిత్ పాంథర్స్ ఆఫ్ ఇండియా(డీపీఐ)కు చెందిన నేతలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో మీరా మిథున్‌తో పాటు ఆమె స్నేహితుడు అభిషేక్‌పై చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 
 
గత 2021 ఆగస్టు నెలలో వారిని అరెస్టు చేయగా, నెల రోజుల తర్వాత వారిద్దరూ మధ్యంతర బెయిలుపై విడుదలయ్యారు. ఆ తర్వాత కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడంతో మీరా మిథున్‌పై 2022లో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అరెస్ట్ వారెంట్ జారీ చేసి మూడేళ్లు గడిచిపోయింది. అయినా ఆమె పరారీలోనే ఉన్నారు. ఆమె ఆచూకీని పోలీసులు కూడా ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారు. 
 
ఈ నేపథ్యంలో ఢిల్లీ నగర వీధుల్లో తిరుగుతున్న మీరా మిథున్‌ను రక్షించాలంటూ ఆమె తల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కోర్టులో విచారణకు రాగా, పోలీసు తరపు న్యాయవాది ఢిల్లీ పోలీసులు మీరా మిథున్‌ను రక్షించి అక్కడున్న హోంకు తరలించారని తెలిపాు. ఢిల్లీ హోంలో ఉన్న మీరా మిథున్‌ను అరెస్టు చేసి ఈ నెల 11వ తేదీన హాజరుపరచాలని చెన్నై క్రైమ్ బ్రాంచ్ప పోలీసులను చెన్నై కోర్టు ఆదేశించింది.