శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 23 అక్టోబరు 2017 (12:59 IST)

అబ్బాయిల పక్కన చెల్లెల్ని కూర్చోబెట్టిన టీచర్.. అక్క ఆత్మహత్య.. ఎక్కడ?

కేరళలో ఓ టీచర్ ఇచ్చిన పనిష్మెంట్ కలకలం సృష్టించింది. ఓ బాలిక తప్పు చేసిందని.. ఆ బాలికను అబ్బాయిల పక్కన కూర్చోబెట్టింది టీచర్. ఆ అవమానాన్ని తట్టుకోలేక బాధితురాలి అక్క పాఠశాల భవంతిపై నుంచి దూకి ఆత్మహత్య

కేరళలో ఓ టీచర్ ఇచ్చిన పనిష్మెంట్ కలకలం సృష్టించింది. ఓ బాలిక తప్పు చేసిందని.. ఆ బాలికను అబ్బాయిల పక్కన కూర్చోబెట్టింది టీచర్. ఆ అవమానాన్ని తట్టుకోలేక బాధితురాలి అక్క పాఠశాల భవంతిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కేరళలోని కొల్లాంలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. కొల్లాంలోని ట్రినిటీ లైసియమ్ స్కూలులో 15ఏళ్ల బాలిక పదో తరగతి చదువుతోంది. 
 
ఆమె సోదరి 13ఏళ్ల బాలిక అదే పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. అయితే 13ఏళ్ల బాలిక తరగతి గదిలో ఎక్కువగా మాట్లాడుతుందని ఆరోపిస్తూ టీచర్ అబ్బాయిల పక్కన కూర్చోబెట్టింది. దీనిపై టీచర్‌తోనూ పదో తరగతి చదివే బాధితురాలి అక్క గొడవపెట్టుకుంది. ఇలా చేయడం సబబు కాదని వాదించింది. ఆపై బాధితురాలి తల్లి కూడా స్కూలుకొచ్చి నిలదీసింది. దీంతో వివాదం రేగడంతో ఇకపై ఇలా జరగకుండా చూస్తామని పాఠశాల యాజమాన్యం హామీ కూడా ఇచ్చింది. 
 
అయితే ఈ సమస్య ఇక్కడితో ఆగిపోలేదు. సమస్య వేరే రూపంలో ఎదురైంది. టీచర్‌తో వాదించిన బాలికను తోటి విద్యార్థులు, చెల్లెలు పక్కన కూర్చున్న అబ్బాయిలో హేళన చేయడం మొదలెట్టారు. దీంతో అవమానం భరించలేక బాధితురాలి అక్క మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆస్పత్రికి హుటాహుటిన తరలించినా ఫలితం లేకపోయింది. బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు టీచర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.