మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 10 అక్టోబరు 2017 (13:34 IST)

కేరళలో తొలి దళిత పూజారి యదు కృష్ణన్...

కేరళ రాష్ట్రంలోని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్ చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా కేరళలో తొలి దళిత పూజారిగా యదు కృష్ణన్ రికార్డు సృష్టించాడు. తిరువల్ల సమీపంలోని మణప్పురం శివాలయంలో ఆయన పూజారిగా చేరా

కేరళ రాష్ట్రంలోని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్ చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా కేరళలో తొలి దళిత పూజారిగా యదు కృష్ణన్ రికార్డు సృష్టించాడు. తిరువల్ల సమీపంలోని మణప్పురం శివాలయంలో ఆయన పూజారిగా చేరారు. కేరళలో దళితుల ఆలయ ప్రవేశానికి నవంబర్ 12వ తేదీతో 81 యేళ్లు పూర్తవుతున్న తరుణంలో యదు కృష్ణన్ బాధ్యతలు స్వీకరించడం విశేషం. 
 
కాగా, దళితుల ప్రవేశాల కోసం 1936 నవంబర్ 12న ట్రావెన్‌కోర్ సంస్థానం తలుపులు తెరిచిన విషయం తెల్సిందే. అలాగే ఆలయాల్లో బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించాలని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా ఈ దళిత యువకుడిని పూజారిగా నియమించింది. 
 
ఈ దేవస్థానం బోర్డు పరిధిలో ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయం సహా 1248 ఆలయాలు ఉన్నాయి. తొలి విడతగా 36 మంది బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించడానికి ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించింది. 
 
పూజారులుగా ఎంపిక చేసిన 36 మందిలో ఆరుగురు దళితులు ఉన్నారు. వీరిలో ఒకరైన యదు కృష్ణన్ (22) సోమవారం బాధ్యతలు చేపట్టారు. సంస్కృతంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి యదు... పదేళ్ళ పాటు వేదమంత్రోచ్ఛారణలో శిక్షణ పొందాడు.