1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దీపావళి
Written By selvi
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2017 (15:00 IST)

దీపావళి: ఆ మూడు రోజుల్లో దీపదానం చేస్తే?

దీపావళికి ముందు రోజు నరకచతుర్దశి.. అంతకుముందు ధనత్రయోదశిని ఆచరిస్తారు. అమావాస్యకు తర్వాతి రోజున బలిపాడ్యమిగా కొన్నిచోట్ల జరుపుకుంటారు. కార్తీశుద్ధ పాడ్యమినే బలిపాడ్యమిగా జరుపుకుంటారు. బలి చక్రవర్తిని

దీపావళికి ముందు రోజు నరకచతుర్దశి.. అంతకుముందు ధనత్రయోదశిని ఆచరిస్తారు. అమావాస్యకు తర్వాతి రోజున బలిపాడ్యమిగా కొన్నిచోట్ల జరుపుకుంటారు. కార్తీశుద్ధ పాడ్యమినే బలిపాడ్యమిగా జరుపుకుంటారు. బలి చక్రవర్తిని మించిన దానశూరులుండరు అంటారు.

వజ్ర, వైఢూర్యాలు, మునిమాణిక్యాలు వంటివి దానమివ్వడంతో పాటు తనకు తానుగానే శత్రువుకు దానం ఇచ్చుకున్న వితరణ శీలి బలిచక్రవర్తి. ఆయన్ని దేశంలోని  కొన్ని ప్రాంతాల్లో పూజించడం ఆనవాయితీ. కేరళలో బలిచక్రవర్తి తమను పరిపాలించాడని నమ్మి, వారు తమ జాతీయ పర్వమైన ఓనంను బలి ప్రీత్యర్ధం జరుపుకుంటారు. 
 
దక్షిణభారతదేశంలో దీపావళి మూడునాళ్ళ పండుగగా జరుపుకుంటే, ఉత్తరభారతదేశంలో, మొత్తం ఐదు రోజులపాటు దీపావళిని జరుపుకోవడం పరిపాటి. సాధారణంగా ధనత్రయోదశి నాటి సాయంత్రం ఇంటి వెలుపల యముని కోసం దీపం వెలిగిస్తే అపమృత్యువు నశిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అలాగే, ధనత్రయోదశి, అమావాస్య, చతుర్దశి రోజుల్లో ప్రదోషసమయాన దీపదానాన్ని చేస్తే, యమమార్గాధికారం నుంచి విముక్తుడు అవుతాడని విశ్వాసం. 
 
దీపోత్సవ చతుర్దశి రోజున యమతర్పణం చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. హేమాద్రి అనే పండితుడు ఈ దీపోత్సవాన్ని "కౌముదీమహోత్సవం" అని నిర్వచించినట్లుగాను, నరకచతుర్దశి రోజున యమునికి తర్పణాన్ని ఆచరించి, దీపదానం చేయాలని చెప్పాడని వివరించారు.