సంబంధిత వార్తలు
07-06-2026 నుంచి 13-06-2026 వరకు ఫలితాలు - అన్ని విధాలా యోగదాయకమే
Weekly Horoscope
పరిస్థితులు క్రమంగా చర్చబడతాయి. నిర్దేశిత లక్ష్యంతో ముందుకు సాగుతారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పరిచయాలు, వ్యాపారాలు అధికమవుతాయి. మంగళవారం వాడు పనులు ఒక పట్టాన పూర్తికావు. మీపై శకునాల ప్రభావం అధికం, సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన శ్రేయస్కరం. పెద్దల సలహా పాటించండి. జూదాలకు పోవద్దు. ఆప్తులతో తరచు సంభాషిస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉపాధ్యాయులకు బదిలీ. అధికారులకు హోదా మార్పు, వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రతి విషయంలోను ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం, ఆత్మీయుల రాకపోకలు అధికమవుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆందరితోను మితంగా సంభాషించండి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. నోటీసులు అందుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ప్రైవేట్ ఉద్యోగస్తులను కష్టసమయం, వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వ్యాపారులు దీర్ఘకాలిక చర్చల్లో పాల్గొంటారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అనుకూలతలు అంతంతమాత్రమే. చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దంపతుల మధ్య సఖ్యత లోపం. మాటతీరు అదుపులో ఉంచుకోండి. బందువర్గాల వారితో విభేదిస్తారు. ఆత్మీయుల చొరవతో ఒక సమస్య సద్గుమణుగుతుంది. ఈ చికాకులు తాత్కాలికమేనని గమనించాలి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. సోమవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోదా వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉద్యోగ విధుల్లో అలక్ష్యం తగదు. ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనకు ఓర్పు, పట్టుదల ముఖ్యం. ఆశావహదృక్పథంతో మెలగండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. కొత్త సమస్యలు ఏర్పడే అవకాశం వుంది జాగ్రత్త వహించండి శనివారం నాడు ఒక పట్టాన పనులు ముందుకు సాగవు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. సన్నిహితులతో తరచూ సంబాషిస్తారు. ఆదాయ వ్యయాలకు సొంతన ఉండదు. రుణాలు, చేబదుళ్లు స్వీకరించవలసి వస్తుంది. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉపాధ్యాయులకు స్థానచలనం, బెట్టింగ్ల జోలికి పోవద్దు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అన్ని విధాలా యోగదాయకమే. తల పెట్టిన కార్యం సఫలమవుతుంది. చాకచక్యంగా పనులు చక్కపెట్టుకుంటారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఇంటి విషయాలపై దృష్టి సారిస్తారు. ఆదివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఇతరులతో మితంగా సంభాషించండి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అయిన వారిలో ఉల్లాసంగా గడుపుతారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. గృహమరమ్మతులు చేపడతారు. వాహనం, విలువైన వస్తువులు జాగ్రత్త. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ప్రైవేట్ ఉద్యోగులకు మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోధం తగదు. వృతి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. స్నేహసంబంధాలు బలపడతాయి. గృహంలో స్తబ్ధత తొలుగుతుంది. దంపతులు ఏకాభిప్రాయానికి రాగలుతారు. సంతానానికి శుభఫలితాలున్నాయి. గురువారం వారు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు హడావుడిగా సాగుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. చిన్ననాటి ఉపాధ్యాయులు తారసపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆత్మీయులతో తరుచు సంభావిస్తారు. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. వ్యాపకాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ప్రతి విషయంలోను ఓర్పుతో ఉండాలి. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఖర్చులు అదుపులో ఉండవు. ధనసమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి. తరచు సన్నిహితులతో సంభాషిస్తారు. దంపతుల మధ్య తరచు కలహాలు. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. ఆదివారం నాడు అప్రియమైన వార్త వినాల్సి వస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఒంటెద్దు పోకడ తగదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరువ్యాపారులకు నిరాశాజనకం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ముఖ్యం. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. న్యాయవాదులకు ఆదాయాభివృద్ధి. ప్రయాణం చికాకు పరుస్తుంది.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కొత్త సమస్యలెదురవుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికి చికాకుపడతారు. కావలసిన పత్రాలు, వస్తువులు సమయానికి కనిపించవు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయమనం పాటించండి. మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. మంగళవారం నాడు ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాప్యం తగదు. గృహమార్పు అనివార్యం. నోటీసులు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల అలక్ష్యం తగదు. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. నూతన వ్యాపారాలపై దృష్టిపెడతారు. సరుకు నిల్వలో జాగ్రత్త, ఉపాధ్యాయులకు, ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఆశావహదృక్పథంతో ఇంటర్వ్యూలకు హాజరుకండి. వేడుకకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యసాధనకు కృషి, పట్టుదల ప్రధానం. ఆచి తూచి అడుగేయాల్సిన సమయం. కలహాలు తప్పవు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్ళ స్వీకరిస్తారు. బుధవారం నాడు చేసిన పనులు మొదటికే వస్తాయి. చిన్న విషయానికే అసహనం చెందుతారు. సన్నిహితులు కలయికతో కుదుటపడతారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. స్థిరచరాస్తుల వ్యవహారంలో మెలకువ వహించండి. తొందరపాటు నిర్ణయం తగదు. పెద్దలను సంప్రదించండి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్య సేవ అవసరమవుతుంది. ఉద్యోగ బాధ్యతలపై శ్రద్ధ వహించండి. ఒత్తిళ్లు ప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. సాహసకృత్యాలకు పాల్పడవద్దు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. గృహమార్పు అనివార్యం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కొన్ని అవకాశాలు అనుకోకుండా కలిసివస్తాయి. శుక్రవారం నాడు అందరితోను మితంగా సంభాషించండి. నోటీసులు అందుకుంటారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వండి. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులు నిరాశాజనకం. న్యాయవాదులకు ఆదాయాభివృద్ధి, వివాదాస్పద విషయాల జోలికిపోవద్దు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ వారం అన్ని రంగాల వారికి కలిసి వస్తుంది. మొండి బాకీలు వసూలుపుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులు, కన్సెల్టెన్సీలను ఆశ్రయించద్దు. త్వరలో శుభవార్త వింటారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో తరచు కాలక్షేపం చేస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. కనిపించేకుండా పోయిన వస్తువులు, పత్రాలు లభ్యమవుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కుటుంబసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ఉద్యోగస్తులు కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆర్థికంగా నిలదొక్కుకుంచారు. రుణసమస్య పరిష్కారమవుతుంది. ఖర్చులు భారమనిపించవు, వాయిదా చెల్లింపుల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. అమెరాలు వెల్లివిరుస్తాయి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. వాహనం అమర్చుకోవాలనే కోరిక తిరుగుతుంది. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. ఇతరులకు బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం దూకుడు అదుపు చేయండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. తరచు సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగులు విధుల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. సాఫ్ట్ వేర్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
