1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
  4. Week Horoscope May 3 - 9, 2026: Mercury’s Taurus Shift Changes Money, Love and decisions

03-05-2026 నుంచి 09-05-2026 వరకు మీ వార ఫలితాలు

Weekly Horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రతికూలతలు అధికం. ఓర్పుతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయం నిరాశాజనకం. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. బంధువుల ఆకస్మిక రాక చికాకు కలిగిస్తుంది. మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. కీలక పత్రాలు అందుకుంటారు. సంతానం విజయం ఉపశమనం కలిగిస్తుంది. సన్నిహితులతో తరచుగా సంభాషిస్తుంటారు. ఫోన్ సందేశాలు విశ్వసించవద్దు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు షాపుల స్థలమార్పు అనివార్యం. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పనిభారం. ధనప్రలోభాలకు తలొగ్గవద్దు, వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సర్వత్రా అనుకూలదాయకం. ప్రతి విషయంలోను చురుకుగా ఉంటారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. కొత్త యత్నాలు చేపడతారు. అవకాశాలు కలిసివస్తాయి. శనివారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. ఆదాయం బాగుంటుంది. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. దంపతులు ఏకాభిప్రాయానికి రాగలుగుతారు. వాహనం అమర్చుకోవాలనే కోరిక బలీయమవుతుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపకాలు అధికమవుతాయి. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకోగలుగుతారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు సదావకాశం లభిస్తుంది. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. మీ నిర్ణయం అందరికీ శిరోధార్యమవుతుంది. వ్యూహాత్మకంగా అడుగు ముందుకేస్తారు. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆసక్తికరమైన విషయం తెలుసుకుంటారు. ఆదివారం నాడు ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు. ధైర్యంగా ముందుకు సాగుతారు. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. చెప్పుడు మాటలకు ప్రాధాన్యమివ్వవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోండి. అవివాహితులు శుభవార్త వింటారు. ఉపాధి పథకాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. చిరు వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెద్దమొత్తం సాయం తగదు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు, పత్రాలు దొరుకుతాయి. సోమవారం నాడు పరిచయం లేని వారితో జాగ్రత్త. ముఖ్యమైన వివరాలు గోప్యంగా ఉంచండి. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. పాత మిత్రులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన బలపడుతుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగ విధులపై దృష్టిపెట్టండి. ఒత్తిళ్లు, ధన ప్రలోభాలకు గురికావద్దు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలు అధికం. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఎవరినీ అతిగా నమ్మవద్దు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. వాయిదాల చెల్లింపుల్లో అలసత్వం తగదు. దంపతుల మధ్య సఖ్యత లోపం. చిన్న విషయానికే చికాకుపడతారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. మంగళవారం నాడు ఊహించని సంఘటన ఎదురవుతుంది. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. సంతానం మంచి ఫలితాలు సాధిస్తారు. మానసికంగా కుదుటపడతారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. ఉద్యోగస్తుల పదోన్నతిని సహోద్యోగులు అడ్డుకుంటారు. ఉపాధ్యాయులకు పనిభారం, విశ్రాంతి లోపం. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. సంప్రదింపులు వాయిదా వేసుకోవటం శ్రేయస్కరం. అనుభవజ్ఞులను సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దు. చేపట్టిన పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మొండిధైర్యంతో ముందుకు సాగురతారు. బుధవారం నాడు ధనసమస్య ఎదురువుతుంది. సాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. అవసరాలకు అతికష్టంమ్మీద ధనం సర్దుబాటవుతుంది. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ప్రకటనలు, ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. సాఫ్ట్‌వేర్ విద్యార్థులకు సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు సమయ పాలన ప్రధానం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిన్నవ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యానుకూలత ఉంది. లక్ష్యానికి చేరువలో ఉన్నారు. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసాలకు ఖర్చుచేస్తారు. సంస్థల స్థాపనలకు రుణాలు మంజూరవుతాయి. స్థిమితంగా పనులు పూర్తిచేస్తారు. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. శుక్రవారం నాడు అప్రమత్తంగా మెలగండి. అపరిచితులతో మితంగా సంభాషించండి. కీలక విషయాలు వెల్లడించవద్దు. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఉద్యోగస్తుల పదోన్నతికి అధికారులు సిఫార్సు చేస్తారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాలో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకలో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
శుభకార్యం నిశ్చయమవుతుంది. వేదికలు అన్వేషిస్తారు. ఖర్చులు విపరీతం. గృహాలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. ఆదివారం నాడు అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండండి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. నోటీసులు అందుకుంటారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. నూతన వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, త్రిప్పట అధికం. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. కలసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. సందేహాలకు తావివ్వవద్దు. స్నేహసంబంధాలు బలపడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. సంతానానికి శుభపరిణామాలున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. మంగళవారం నాడు ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాతవ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. మీ సమస్యను ఆప్తులకు తెలియజేయండి. అనాలోచితంగా వ్యవహరించవద్దు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఒత్తిళ్లకు గురికావద్దు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరమైన అవకాశం లభిస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. న్యాయ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ వారం అనుకూలదాయకం. వ్యవహరాల్లో సరైన నిర్ణయం తీసుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పరిచయస్తులకు సాయం చేస్తారు. పనులు నిరాటంకంగా సాగుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఒత్తిళ్లకు గురికావద్దు. నిపుణుల సలహా పాటించండి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. కలుపుగోలుగా మెలుగుతారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లకు దీటుగా స్పందిస్తారు. ఉద్యోగ విధుల పట్ల ఏకాగ్రత వహించండి. ఉపాధి పథకాలు చేపడతారు. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. అప్రయత్నంగా అవకాశం కలిసివస్తుంది. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ప్రకటనలు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. అధికారులకు హోదామార్పు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు సామాన్యం. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ ఇబ్బందులను సున్నితంగా తెలియజేయండి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. మీ అంగీకారం పెద్దల ద్వారా తెలియజేయండి. మీ శ్రీమతి గురించి ఆందోళన చెందుతారు. పనులు, కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆప్తులతో తరచు సంభాషిస్తారు. పత్రాల్లో సవరణలు సానుకూలమవుతాయి. ఆదివారం నాడు అందరితోను మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తారు. విమర్శలు పట్టించుకోవద్దు. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. నూతన వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ప్రయాణం తలపెడతారు. 
About Writer
పి.ప్రసూనా రామన్