సంబంధిత వార్తలు
- 19-04-2026 నుంచి 25-04-2026 వరకు మీ వార ఫలితాలు
- 12-04-2026 నుంచి 18-04-2026 వరకు మీ వార ఫలితాలు
- 05-04-2026 నుంచి 11-04-2026 వరకు ఫలితాలు- మీ శ్రీమతిని కష్టపెట్టొద్దు...
- 29-03-2026 నుంచి 04-04-2026 వరకు మీ వార ఫలితాలు- ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి..?
- 22-03-2026 నుంచి 28-03-2026 వరకు మీ వార ఫలితాలు- ఎవరికి లాభం?
26-04-2026 నుంచి 02-05-2026 వరకు ఫలితాలు - అహంకారం ప్రదర్శించవద్దు
Weekly Horoscope
కార్యసాధనకు ఓర్పు, పట్టుదల ముఖ్యం, ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోండి. సాయం చేసి భంగపడతారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చేతిలో ధనం నిలవదు. శనివారం వారు ప్రముఖల సందర్శనం కోసం పడిగాపులు తప్పువు. దంపతుల మధ్య అవగాహన లోపం, చీటికిమాటికి అసహానం చెందుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. గృహమరమ్మతులు చేపడతారు. పరిచయస్తుల రాక చికాకు పరుస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు ధన్యప్రలోభం తగదు. ఉపాధి పథకాలు చేపడతారు. న్యాయవాదులకు ఆదాయం బాగుంటుంది. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఈ వారం కలిసివచ్చే సమయం. ఆశలొదిలేసుకున్న ధనం వసూలవుతుంది. ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి. వ్యూహాత్మకంగా అడుగు ముందుకేస్తారు. పనులు మరింత వేగవంతమవుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. వివాహయత్నాలు ఫలించే సూచనలున్నాయి. అవతలి వారి తాహతును క్షుణ్ణంగా తెలుసుకోండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలోస్తాయి. స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలపడుతుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పనిభారం నుంచి విముక్తి. సేవ, సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
గ్రహసంచారం అనుకూలంగా ఉంది. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ పైనాస్సులలో మదుపు తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. ప్రణాళికాబద్దంగా పనులు పూర్తి చేస్తారు. ప్రియతముల రాక ఉత్సాహం కలిగిస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. చెప్పుడు మాటలకు ప్రాధాన్యం ఇవ్వవద్దు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. అధికారులకు అదనపు బాధ్యతలు, వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ప్రయాణం తలపెడతారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రతి విషయంలోను ధైర్యంగా ఉంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు అందుతాయి. ఆదాయం బాగుంటుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. కొన్ని పనులు అర్థాంతంగా పూర్తవుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. బంధుమిత్రులతో సంభాషిస్తారు. బుధవారం నాడు దంపతుల మధ్య అవగాహన లోపం, సామరస్యంగా సమస్య పరిష్కరించుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు, వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా తెలియజేయండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికం. వివాదాలు కొలిక్కివస్తాయి. దైవదర్శనాలు ఉల్లాసం కలిగిస్తాయి.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శ్రమించినా ఫలితం ఉండదు. మీ సామర్థ్యంపై నమ్మకం కుదురుతుంది. నిస్తేజానికి లోనవుతారు. ఏ విషయం పై ఆసక్తి ఉండదు. పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. అవకాశాలు చేజారిపోతాయి. ఓర్పు, పట్టుదలతో మెలగండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. గురువారం నాడు కొత్త సమస్య ఎదురవుతుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. సంతానం పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులను ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం, ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. అహంకారం ప్రదర్శించవద్దు. పెద్దల జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. ఓర్పుతో మెలగండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. శుక్రవారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. అయిన వారు మీ ఆవశ్యకతను అర్ధం చేసుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. యాదృచ్చికంగా పొరపాటు దొర్లే ఆస్కారం ఉంది. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త పథకాలు చేపడతారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు సామాన్యం. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఇంటి విషయాలపై దృష్టి సారిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వాహన సౌఖ్యం, వస్తు లాభం ఉన్నాయి. ఆదివారం నాడు ఏ పనీ చేయబుద్ధి కాదు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. సంతానం పరీక్షలో మంచి ఫలితాలు సాధిస్తారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. రుణాలు మంజూరవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత పదవీయోగం. విందులకు జరవుతారు. ప్రయాణంలో ఒక అవస్థలు ఎదుర్కొంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అవకాశాలు చేజారిపోతాయి. మీ సామర్థ్యంపై నమ్మకం తగ్గుతుంది. చిన్న విషయానికే పరమితమవుతారు. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోండి. అందరితోను మితంగా సంభాషించండి. అకారణంగా కొందరికి విరోధులవుతారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. సోమవారం నాడు పనులు బాధ్యతలు ఇతరులకు పురమాయించవద్దు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. చిన్న వ్యాపారులకు నిరాశాజనకం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు అదనపు బాధ్యతలు. ఉపాధి పథకాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రేమానుబంధాలు బలపడతాయి. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు చేరువవుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. కష్టమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. కొంత మొత్తం పొదుపు చేస్తారు. గురువారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. దంపతులు ఏకాభిప్రాయానికి వస్తారు. స్థిరచరాస్తి వ్యవహారంలో మెలకువ వహించండి. మధ్యవర్తులను నమ్మవద్దు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. పాతమిత్రులతో సంభాషిస్తారు. ఉద్యోగులకు పదవీయోగం. ఉపాధ్యాయులకు ఒత్తిడి. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. కొత్త వ్యాపారాలు చేపడతారు. పెద్ద మొత్తం నిల్వలో జాగ్రత్త
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆదాయం సంతృప్తికరం, మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. అనుకున్న విధంగా పనులు పూర్తిచేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెడతారు. గృహమార్పు అనుకూలం. శనివారం నాడు ప్రియమైన వార్త వింటారు. కార్యక్రమాలు ముందుకు సాగవు అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. అవివాహితులకు శుభయోగం. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త పథరాలు చేపడతారు. ఉద్యోగ విధుల పట్ల శ్రద్ధ వహించండి. ప్రలోభాలకు గురికావద్దు. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్ధికలావాదేవీలు కొలిక్కివస్తాయి. సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటారు. ధనసమస్య పరిష్కారమవుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పరిచయాలు బలపడతాయి. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆదివారం నాడు ప్రముఖుల కలయిక వీలుపడదు. ధైర్యంగా అడుగు ముందుకొస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్ధంలో మెలకువ వహించండి. సాధ్యం కాని హామిలివ్వవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. పోటీ పరీక్షల్లో సంతానం మంచి ఫలితాలు సాధిస్తారు. చిన్ననాటి మిత్రులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. ఉపాధి పథకాలు చేపడతారు. వృత్తుల వారి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. అన్నీ వివాదాలు పరిష్కారమవుతాయి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
నిర్దేశిత లక్ష్యంతో ముందుకు సాగుతారు. అదృష్టం కలిగిస్తుంది. లక్ష్యానికి చేరువవుతారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనులు బాధ్యతలు అప్పగించవద్దు. మంగళవారం నాడు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. హడావుడిగా సాగుతాయి. గృహమరమ్మతులు చేపడతారు. వాహనం, విలువైన వస్తువులు జాగ్రత్త. కొందరి నిర్లక్ష్యం వల్ల సమస్యలెదుర్కోవలసి వస్తుంది. నోటీసులు అందుకుంటారు. ప్రముఖల ప్రమేయంతో వివాదం సద్దుమణుగుతుంది. వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు బదిలీతో కూడిన పదోన్నతి, ఉపాధ్యాయులను అదనపు బాధ్యతలు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. సన్మాన సంస్మరణ సభల్లో పాల్గొంటారు.
