22-03-2026 నుంచి 28-03-2026 వరకు మీ వార ఫలితాలు- ఎవరికి లాభం?
Weekly Horoscope
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. సోమవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ. వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. వ్యతిరేకులతో జాగ్రత్త, ఆచితూచి అడుగేయండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. దాంపత్యసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. పత్రాల రెన్యువల్‌లో జాగ్రత్త వహించండి. వస్త్ర, బంగారం వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. అనుకున్నట్లే మొక్కుబడులు తీర్చుకుంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. మీ మాటకు ఎదురుండదు. గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి. నిర్దేశిత ప్రణాళికలతో ముందుకు సాగుతారు. అవకాశాలు కలిసివస్తాయి. కలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. ఆదాయం పర్వాలేదనిపిస్తుంది. రోజువారి ఖర్చులే ఉంటాయి. బుధవారం నాడు చెల్లింపులు, నగదు స్వీకరణలో ఏకాగ్రత వహించండి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదరకపోవచ్చు. నిరుత్సాహానికి గురికావద్దు. త్వరలో శుభవార్త వింటారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఆత్మీయులతో తరుచు సంభాషిస్తుంటారు. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. దస్త్రం వేడుక ప్రశాంతంగా సాగుతుంది. ఉద్యోగ బాధ్యతల పట్ల శ్రద్ద చూపండి. విద్యార్థులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యయాలు సంతృప్తికరం ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. మంగళవారం నాడు ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కొందరి అలక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. ఆప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. అయిన వారితో ఉత్సాహంగా గడుపుతారు. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ శ్రీమతి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ప్రోత్సాహకరం ఉద్యోగస్తులు ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. శుభకార్యానికి హాజరవుతారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఇంకొకరికి కలిసివస్తుంది. నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. చేపట్టిన పనులు అర్ధాంతంగా ముగిస్తారు. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో అడుగు ముందుకేయండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఆదాయం అంతంత మాత్రమే. స్థిరాన్ని ధనం ఆలస్యంగా అందుతుంది. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. పరిచయం లేని వారితో మితంగా సంభాషించండి. వ్యాపారాలు -సామాన్యంగా సాగుతాయి. దస్త్రం వేడుకను మొక్కుబడిగా పూర్తిచేస్తారు. ఉద్యోగ బాధ్యతలపై దృష్టిపెట్టండి. ప్రలోభాలకు లొంగవద్దు,
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ వారం కొంతమేరకు ఆశాజనకం. మొండి బాకీలు వసూలవుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. కొన్ని విషయాలు అనుకున్నట్లు జరుగుతాయి. మొండిగా పనులు పూర్తిచేస్తారు. దంపతుల మధ్య అవగాహనలోపం. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. నిపుణులను సంప్రదిస్తారు. బంధువర్గం వారితో విభేదాలు తలెత్తుతాయి. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. పట్టుదలకు పోవద్దు. ప్రైవేట్ ఉద్యోగస్తులను ఓర్పు ప్రధానం. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వ్యాపారాభివృద్ధికి పథకాలు వేస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త, వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లావాదేవీలు ముగుస్తాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. అవసరాలు తీరుతాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. సంతానం పై చదువులపై దృష్టి పెడతారు. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. గృహంలో సందడి నెలకొంటుంది. మీ. శ్రీమతిని కష్టపెట్టవద్దు. శనివారం నాడు అనవసర జోక్యంతగదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి. అవివాహితులకు శుభయోగం. ఆందోళన కలిగించిన సమస్య తొలుగుతుంది. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. మీ పథకాలు ఆశించినట్లు ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోదం తగదు. కొత్త వ్యక్తుల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు బలపడతాయి. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతారు. చేపట్టిన పనులు త్వరితగతిన సాగుతాయి. వాహనం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. దాంపత్య సౌఖ్యం ప్రశాంతత పొందుతారు. సోమవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు గురికావద్దు. సన్నిహితుల సలహా పాటించండి. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వృత్తి, నూతన వ్యాపారాల్లో అనుభవం గడిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. అవకాశాలను దర్శించుకుంటారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మీ శ్రీమతి సలహా పాటిస్తారు. ఆదాయం బాగుంటుంది. బంధుమిత్రులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. మీ ఇబ్బందులను సామరస్యంగా తెలియజేయండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. సోదరుల నుంచి అభ్యంతరాలెదురవుతాయి. పెద్దల జోక్యంతో సమస్య సానుకూల సుసుతుంది. ఆశావహదృక్పదంతో ఉద్యోగ యత్నాలు సాగించండి. మీ కృషి ఫలిస్తుంది. నూతన వ్యాపారాలకు అనుకూల సమయం. సొంత వ్యాపారాలే తెలిసివస్తాయి. శుభకార్యానికి హాజరవుతారు. కానుకలిచ్చి పుచ్చుకుంటారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఏదో సాధించలేకపోయామనుకున్న భావం వెంటాడుతుంది. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ పని చేయబుద్ధి కాదు. నిరుత్సాహం గడుపుతారు. మీ శ్రీమతితో స్వల్ప కలహం, మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఆత్మీయుల దాడితో కుదుటపడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి, సంతానానికి మంచి జరుగుతుంది. అహ్వానం అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఔషధ సేవనం, ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. దస్త్రం వేడుక ప్రశాంతంగా ముగుస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం, రిటైర్లు ఉద్యోగస్తులకు రావలసిన బెనిఫిట్స్ అందుతాయి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
పరిస్థితులు మెరుగుపడతాయి. స్థిరచరాస్తి మూలక ధనం అందుతుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆదివారం ప్రముఖుల ఇంటర్వ్యూ సాధ్యపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సదావకాశాలు కలిసి వస్తాయి. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. నిశ్చితార్థంలో ఏకాగ్రత వహించండి. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. సామరస్యంగా వారికి నచ్చచెప్పండి. ఉద్యోగస్తులు ప్రమోషనకు అధికారులు సిఫార్సు చేస్తారు. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. పరిస్థితులకు వీలుగా స్పందిస్తారు. సాంకేతిక రంగాల వాటికి ఆదాయాభివృద్ధి, దైవ కార్యంలో పాల్గొంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఓర్పుతో యత్నాలు సాగించండి. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. ఆశావహదృక్పథంతో మెలగండ. మీ కృషి ఫలిస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. ఇతరుల కోసం ఖర్చుచేస్తారు. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. బుధవారం నాడు దంపతుల మధ్య అకారణ కలహం. చిన్న విషయానికి చికాకుపడతారు. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. ఇంటి విషయాలపై దృష్టి పెట్టండి. గృహనిర్మాణాలు మందగాడిగా సాగుతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. ఏ విషయాన్ని తేలికగ్గా తీసుకోవద్దు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ముఖ్యం. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు మంచి ఫలితాలిస్తాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. వ్యూహాత్మకంగా ఒకడుగు ముందుకేస్తారు. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. పరిచయం లేని వారితో, అందరితోను మితంగా సంభాషించండి. మంగళవారు నాడు పనులు ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. కొందరి దాక ఇబ్బంది కలిగిస్తుంది. వివాహయత్నం ఫలించే సూచనలు ఉన్నాయి. మీ ఇష్టాయిష్టాలను పెద్దల ద్వారా తెలియజేయండి. ఆదాయం బాగుంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. కొంతమొత్తం పొదుపు చేస్తారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. మీ సాయంతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులు కలిసివస్తాయి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
