1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 06-06-2026 Daily Astrology

06-06-2026 శనివారం ఫలితాలు - సర్వత్రా మీదే పైచేయి

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
పొదుపు ధనం అందుకుంటారు. రుణ సమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు. చాకచక్యంగా అడుగులేస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పనులు మందకొడిగా సాగుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆప్తులతో సంభాషిస్తారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీ కృషి ఫలిస్తుంది. కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు సామాన్యం. చెల్లింపుల్లో జాప్యం తగదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, అర్థ, పునర్వసు 1, 2, 3 పాదాలు
నేడు అనుకూలదాయకం. లక్ష్యాన్ని సాధిస్తారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. కొంతమొత్తం పొదుపు చేయగలుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. నిలిపి చేసిన పనులు పునఃప్రారంభిస్తారు. ఉల్లాసంగా గడుపుతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శుభవార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం, ప్రణాళికలు రూపొందించుకుంటారు. పనులు ఇతరులకు అప్పగించవద్దు. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ఉభయులకూ మీ నిర్ణయం ఆమోదయోగ్యమవుతుంది. వేడుకలో అత్యుత్సాహం తగదు.
 
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఒత్తిళ్లకు గురవద్దు, ఆప్తులతో కాలక్షేపం చేయండి. ఖర్చులు అధికం. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ప్రయాణాలు, కార్యక్రమాలు వేసుకుంటారు. కీలక పత్రాలు అందుతాయి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు.
లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. విమర్శలు వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మనోధైర్యమే మీ విజయానికి దోహదపడుతుంది. దుబారా ఖర్చులు విపరీతం, పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. పుణ్యక్షేత్రం, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలు అధికం. చిన్న విషయానికి చికాకుపడుతారు. అతిగా ఆలోచించవద్దు. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. ఖర్చులు సామాన్యం, పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండండి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సర్వత్రా మీదే పైచేయి. కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. విలాసాలకు  విపరీతంగా వ్యయం చేస్తారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. పెద్దల ఆరోగ్యం కుదుట పడుతుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం:
మీదైన రంగంలో పురోభివృద్ధి సాధిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖర్చులు సామాన్యం. పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు పూర్తి చేస్తారు. ఒక సమాచారం మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకుంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు అధికం. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారంలో అనుభవజ్ఞుల సలహా తీసుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాధ్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనలో ఒత్తిళ్లకు గురికావద్దు. అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం. తొందరపాటు నిర్ణయాలు తగవు, ఓర్పు, పట్టుదలతోనే కార్యం సిద్ధిస్తుంది. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనులు మందకొడిగా సాగుతాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
గృహస్థితి బాగుంది. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనులు వేగవంతమవుతాయి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు జాగ్రత్త. యత్నాలకు సన్నిహితులు ప్రోత్సహిస్తారు. జూదాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.
About Writer
పి.ప్రసూనా రామన్