సంబంధిత వార్తలు
05-06-2026 శుక్రవారం ఫలితాలు- రావలసిన ధనాన్ని చాకచక్యంగా రాబట్టుకోవాలి
Astrology
ఆచితూచి అడుగేయాలి. అనవసర జోక్యం తగదు. వివాదాల్లో మీ ప్రమేయం లేకుండా చూసుకోండి. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మితంగా సంభాషించండి. దంపతుల మధ్య సఖ్యత ఉండదు. చీటికిమాటికి చికాకుపడతారు. ఖర్చులు విపరీతం.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లావాదేవీలు సంతృప్తినిస్తాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, అర్థ, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. పనులు సానుకూలనువుతాయి. దైవకార్యానికి వ్యయం చేస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. నోటీసులు అందుకుంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఒప్పందాలకు అనుకూలం. ప్రముఖుల సలహా పాటిస్తారు. ధనలాభం, వాహనసౌఖ్యం. ఉన్నాయి. ఖర్చులు అధికం, కొత్త యత్నాలు చేపడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అపోహలకు తావివ్వవద్దు.
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు చక్కబడతాయి, కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఖర్చులు తగ్గించుకుంటారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. వాహనం మరమ్మతుకు గురవుతుంది.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు.
కీలక వ్యవహారంలో నిపుణులను సంప్రదించండి. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు, రుణ సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. ఓర్పుతో శ్రమించిన గాని పనులు కావు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ముందుకు సాగవు. అన్యమనస్కంగా గడుపుతారు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. రావలసిన ధనాన్ని చాకచక్యంగా రాబట్టుకోవాలి. సన్నిహితులు వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు సాగవు. సోదరీ సోదరులతో విభేదిస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి: ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు విపరీతం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం:
నిర్దిష్ట లక్ష్యంతో ముందుకు సాగుతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. మాటతీరు అదుపులో ఉంచుకోండి. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. వాహనం కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త, కీలక సమావేశంలో పాల్గొంటారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సర్వత్రా అనుకూలమే. సాహసించి నిర్ణయాలు తీసుకుంటారు. మీ కష్టం వృధా కాదు. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. సలహాలు, సాయం ఆశించవద్దు, అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాధ్ర 1, 2, 3 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు, కృషి ప్రధానం. మీ సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. ఏకాగ్రతతో కార్యక్రమాలు. కొనసాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. అవకాశాలను వదులుకోవద్దు. పట్టుదలతో శ్రమించిన గాని పనులు కావు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆర్ధిక ఇబ్బందులు లేకున్నా సంతృప్తి ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. మనోధైర్యంతో మెలగండి. ఖర్చులు అధికం, గృహం ప్రశాంతంగా ఉంటుంది. సన్నిహితులు హితవు మీపై పనిచేస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి.
