సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By Selvi
Last Updated : శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (13:50 IST)

శరన్నవరాత్రులు-నవగ్రహాలకు లింకుందా..? శెనగలను నైవేద్యంగా పెడితే?

నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు పూజ చేయలేని వారు మూలా నక్షత్రం రోజు అంటే సరస్వతీ పూజ అయిన సప్తమి నాటి నుండి మూడు రోజులు పూజ చేస్తే సకల శుభాలు చేకూరుతాయి. ఆయుధపూజ, సరస్వతీ పూజ, విజయదశమి రోజుల్ల

నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు పూజ చేయలేని వారు మూలా నక్షత్రం రోజు అంటే సరస్వతీ పూజ అయిన సప్తమి నాటి నుండి మూడు రోజులు పూజ చేస్తే సకల శుభాలు చేకూరుతాయి. ఆయుధపూజ, సరస్వతీ పూజ, విజయదశమి రోజుల్లో పూజ చేయడం ద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. విద్యకు అధిపతి అయిన సరస్వతీ దేవి ముందు పుస్తకాలు, మనం చేసే వృత్తులకు ఉపయోగించే ఆయుధాలను ఉంచి పూజించడం ద్వారా మేలు జరుగుతుంది. 
 
ఆయుధ పూజ చేసేటప్పుడు యంత్రాలు, ఆయుధాలు, పెన్సిల్, పెన్నులను శుభ్రపరిచి పూజ చేయాలి. ఈ రోజునే మహా నవమి (శరన్నవరాత్రుల్లో 9వ రోజు)గా పిలుస్తారు. పదో రోజున విజయదశమిని జరుపుకోవాలి. ఇలా శరన్నవరాత్రుల్లో 9, 10 రోజుల్లో సరస్వతీ దేవిని పూజించడం ద్వారా జ్ఞానం, వ్యాపారాభివృద్ధి చేకూరుతుంది. తొమ్మిదో రోజు పూజను ముగ్గురమ్మలు స్వీకరిస్తారు. 
 
సరస్వతీ దేవిని పూజించేటప్పుడు శెనగలు, పండ్లును నైవేద్యంగా సమర్పించవచ్చు. శరన్నవరాత్రుల్లో 9వ రోజున శెనగలను నైవేద్యంగా సమర్పించడం ద్వారా నవగ్రహాలను తృప్తిపరిచిన వారమవుతాం. తద్వారా నవగ్రహాలచే ఏర్పడే దోషాలు, ఈతిబాధలు దూరమవుతాయి. ఇక నవరాత్రులు ప్రారంభమైన నాటి నుంచి తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజూ గుమ్మానికి తోరణాలు కట్టుకుని.. ముగ్గురమ్మలను పూజించిన వారికి సర్వదోషాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు.