1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Heavy rain alert for AP due to low pressur

బంగాళాఖాతంలో వాయుగుండం... భారీ నుంచి అతిభారీ వర్షాలు

low pressure
బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దక్షిణ అండమాన్‌ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపింది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 16 నాటికి వాయుగుండంగా బలపడనుందని వెల్లడించింది. 
 
మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఈ కారణంగా మంగళ, బుధవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మంగళవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 
తర్వాతి కథనం
మంగళవారం తిరుమలలో పెరిగిన రద్దీ