ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 నవంబరు 2023 (11:20 IST)

దీపావళి: తెలుగు రాష్ట్రాల్లో అగ్ని ప్రమాదాలు

fire accident
దీపావళి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అనేక అగ్నిప్రమాద ఘటనలు జరిగాయి. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ పరిధిల్లో పది చోట్ల అగ్నిప్రమాదాలు జరిగి భారీగా ఆస్తి నష్టం జరిగింది.
 
మరోవైపు విశాఖ జిల్లా అగనంపూడిలోని బొర్రమాంబ గుడి దగ్గర ఉన్న స్క్రాప్ యార్డ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఫైర్‌ సిబ్బంది మంటలార్పారు. 
 
సంఘం ఆఫీస్ ప్రాంతంలోని సాయి సుగుణ అపార్ట్ మెంట్ అయిదో అంతస్తులో తాళం వేసి ఉన్న ఫ్లాట్ లో మంటలు చెలరేగాయి. దీంతో మిగతా ఫ్లాట్లలో ఉండేవారు పరుగులు తీశారు. ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.