1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. telangana election nomination

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. నామినేషన్ల పరిశీలన

telangana assembly
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు ఈసీ నవంబర్ 3న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను సోమవారం ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. 
 
పార్టీల తరపున వేసిన దరఖాస్తు తిరస్కరణకు గురైతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు ముందస్తుగా నామినేషన్ వేశారు. దీంతో ఎన్ని దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి అనేది తేలిపోనుంది. ఇక ఈ నెల 15వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవచ్చు. తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలకు 2,327 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 
తర్వాతి కథనం
ఫుడ్ డెలివరీ బాయ్స్ అంటూ ఇంట్లోకి దొంగలు.. రూ.23.50 దోచేశారు..