బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2023 (15:33 IST)

నేడు కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్న రేవంత్ రెడ్డి

revanth reddy
తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్రవారం కామారెడ్డిలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఆయన మధ్యాహ్నం 2 గంటల సమయంలో నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ తర్వాత కామారెడ్డి టీపీసీసీ ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్ సభలో ఆయన పాల్గొంటారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి బీసీ డిక్లరేషన్ సభ ప్రారంభమవుతుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రత్యేకంగా హాజరువుతున్నారు. అలాగే, మరికొందరు ఆ పార్టీకి చెందిన జాతీయ కాంగ్రెస్ నేతలు సైతం హాజరవుతున్నారు. 
 
ఇదిలావుంటే, ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్ కూడా నామినేషన్ పత్రాలు సమర్పించిన విషయం తెల్సిందే. ఈయన రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఒక స్థానం కామారెడ్డి కాగా మరొక స్థానం గజ్వేల్‌‍లో పోటీ చేస్తున్నారు. గజ్వేల్‌లోని సమీకృత భవనంలో రిటర్నింగ్ అధికారికి ఆయన రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ పత్రాలు సమర్పించిన తర్వాత కేసీఆర్ తన ప్రచార వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. 
 
అలాగే, ఆయన కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. మరోవైపు సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావు నామినేషన్ పత్రాలను స్థానిక ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అలాగే, మరికొందరు బీఆర్ఎస్ నేతలు తమ నామినేషన్ పత్రాలను తమతమ అసెంబ్లీ స్థానాల్లోని రిట్నింగ్ అధికారులకు అందజేశారు.