ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : గురువారం, 9 నవంబరు 2023 (19:48 IST)

ఏడుకొండలవాడు - పరమేశ్వరుడు... ఇద్దరూ దేవుళ్లే : బండ్ల గణేశ్

bandla ganesh
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేస్తున్నారు. అలాంటి పవన్‌ను దేవుడుగా కొలిచే ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ ఆసక్తికరంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గర్విస్తున్నట్టు చెప్పారు. తనకు పవన్ కళ్యాణ్ దేవుడితో సమానమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా దేవుడితో సమానమని తెలిపారు. ఏడుకొండలవాడు, పరమేశ్వరుడు ఇద్దరూ దేవుళ్లేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తాను తుదిశ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానన్నారు. తెలంగామాలో కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందన్నారు. డిసెంబరు 9వ తేదీన కాంగ్రెస్ నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. ఏడో తేదీన తాను ఎల్పీ స్టేడియంకు వెళ్లి దుప్పటి కప్పుకుని పడుకుంటానన్నారు. మరి మీ దేవుడు పవన్ పార్టీ పోటీ చేస్తుంది కదా అని ప్రశ్నించగా, తాను పవన్ అభిమానినే అయినప్పటికీ ఎన్నికల్లో ఆయనకు మద్దతు ఇవ్వనని తేల్చి చెప్పారు.