సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 26 మే 2018 (21:53 IST)

భర్త రెండో పెళ్ళి చేసుకుంటున్నాడని తెలిసి ముక్కలు ముక్కలుగా నరికి...

పదిహేడేళ్ళు కాపురం చేశాడు. ఇద్దరు ఆడపిల్లలకు తండ్రయ్యాడు. ఇప్పుడు మళ్ళీ రెండో పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాడు. దీంతో ఆ భార్య చిర్రెత్తుకొచ్చింది. నిద్రిస్తున్న భర్తను కత్తితో ముక్కలు ముక్కలుగా నరికేసింది. ఆ తరువాత నేరుగా పోలీస్టేషనుకు వెళ్ళి లొంగిపోయి

పదిహేడేళ్ళు కాపురం చేశాడు. ఇద్దరు ఆడపిల్లలకు తండ్రయ్యాడు. ఇప్పుడు మళ్ళీ రెండో పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాడు. దీంతో ఆ భార్య చిర్రెత్తుకొచ్చింది. నిద్రిస్తున్న భర్తను కత్తితో ముక్కలు ముక్కలుగా నరికేసింది. ఆ తరువాత నేరుగా పోలీస్టేషనుకు వెళ్ళి లొంగిపోయింది. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపుతోంది.
 
చిత్తూరు జిల్లా శాంతిపురంకు చెందిన శివాజీ, మాధవిలకు 17 యేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్తకు వారసుడు నిలబెట్టే కుమారుడు కావాలని పట్టుబట్టాడు. గత రెండు నెలలుగా కుమారుడి కోసమే వీరి మధ్య గొడవ జరుగుతోంది. దీంతో శివాజీ ఎలాగైనా రెండో పెళ్ళి  చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. భార్య మాధవికి చెప్పి ఒప్పించే ప్రయత్నం చేశాడు. 
 
మరో రెండు రోజుల్లో పెళ్ళి జరుగనుంది. భర్త శివాజీకి పెళ్ళి వద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. దీంతో మాధవి ఈరోజు తెల్లవారు జామున భర్త నిద్రిస్తుండగా వంటగదిలోని కత్తిని తీసుకుని భర్తను ముక్కలు ముక్కలుగా నరికేసింది. ఆ తరువాత బంధువులకు ఫోన్ల ద్వారా విషయం చెప్పి కత్తితో పాటు శాంతిపురం పోలీస్టేషనుకు వెళ్ళి లొంగిపోయింది.