మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 22 మే 2018 (09:21 IST)

రవీంద్ర జడేజా భార్యను జుట్టు పట్టుకుని కొట్టబోయాడు.. అంతలో?

టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చేదు అనుభవం ఎదురైంది. రవీంద్ర జడేజా సతీమణి భార్య రీవా సోలంకి ప్రయాణీస్తున్న కారు రాంగ్‌ రూటులో వస్తున్న కానిస్టేబుల్ సజయ్ అహిర్ టూ వీలర్‌ను స్వల్పంగా ఢీకొంది. దీంత

టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చేదు అనుభవం ఎదురైంది. రవీంద్ర జడేజా సతీమణి భార్య రీవా సోలంకి ప్రయాణీస్తున్న కారు రాంగ్‌ రూటులో వస్తున్న కానిస్టేబుల్ సజయ్ అహిర్ టూ వీలర్‌ను స్వల్పంగా ఢీకొంది. దీంతో రీవా సోలంకి కానిస్టేబుల్‌తో వాగ్వివాదానికి దిగింది. అయితే ఈ  వాగ్వివాదం రీవాపై చేజేసుకునే స్థాయికి చేరుకుంది. ఈ ఘటన సోమవారం సాయంత్రం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో సారు సెక్షన్ రోడ్డులో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. కారు, బైకును ఢీకొన్న వెంటనే కోపంతో కారు వద్దకు చేరుకున్న కానిస్టేబుల్ అహిర్ ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. దీంతో రీవాకు స్వల్ప గాయాలైనట్లు జామ్‌నగర్ ఎస్పీ ప్రదీప్ సేజుల్ తెలిపారు. 
 
ఒకానొక దశలో రీవాను జుట్టు పట్టుకుని కొట్టడానికి ప్రయత్నించగా తాము అడ్డుకున్నామని ప్రత్యక్ష సాక్షులు కూడా వెల్లడించారు. అంతేగాకుండా రీవాకు అన్ని రకాలుగా సహకరిస్తున్నామని, దాడికి దిగిన కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. రీవా ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కానిస్టేబుల్ అహిర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.