మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 14 మే 2018 (12:28 IST)

బరువు గురించి భయం లేదు.. మళ్లీ టెన్నిస్ ఆడుతా.. సర్ నేమ్ మీర్జా-మాలిక్: సానియా

హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం గర్భంగా వున్న తాను.. ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనివ్వాలని భావిస్తున్నానని.. ప్రస్తు

హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం గర్భంగా వున్న తాను.. ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనివ్వాలని భావిస్తున్నానని.. ప్రస్తుతానికి వేరొక ఆలోచన మదిలో లేదని వెల్లడించింది. అయితే తాను ప్రసవం తర్వాత టెన్నిస్ కోర్టులో ఆడుతానని సానియా మీర్జా నమ్మకం వ్యక్తం చేసింది. 
 
దీంతో టెన్నిస్ ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చింది. ఇంకా గర్భానికి ముందు తర్వాత బరువు పెరిగిపోతారని.. దాంతో టెన్నిస్ ఆడలేనని వస్తున్న వార్తలపై సానియా స్పందిస్తూ.. బరువు గురించి భయం లేదని చెప్పింది. 
 
మహిళలు గర్భంగా వున్నప్పుడు.. తర్వాత బరువు పెరగడం సహజం. కానీ తన విషయంలో భయం లేదని.. పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగుతానని సానియా నమ్మకం వ్యక్తం చేసింది. పుట్టబోయిన బిడ్డకు సర్ నేమ్‌ని మీర్జా-మాలిక్ అని డిసైడ్ చేశామని.. ప్రస్తుతం తన సంతానంపై దృష్టి పెడతానని.. ఆ తర్వాతే టెన్నిస్ గురించి ఆలోచిస్తానని సానియా మీర్జా చెప్పుకొచ్చింది.