శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : సోమవారం, 14 మే 2018 (11:37 IST)

ఇంపాజిబుల్ అనే పదంలోనే ఐయాం పాజిబుల్ అనే అర్థం వుంది: జేడీ

''ఇంపాజిబుల్'' అనే పదంలోనే ఐయాం పాజిబుల్ అనే అర్థం వుందని.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. భారత్‌లో ఎలాంటి మార్పునైనా సాధించుకోవచ్చునని.. కానీ అందుకు కొతం సమయం పడుతుంటే తప్ప.. అసాధ్యం అనే పదాన

''ఇంపాజిబుల్'' అనే పదంలోనే ఐయాం పాజిబుల్ అనే అర్థం వుందని.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. భారత్‌లో ఎలాంటి మార్పునైనా సాధించుకోవచ్చునని.. కానీ అందుకు కొతం సమయం పడుతుంటే తప్ప.. అసాధ్యం అనే పదానికే ఆస్కారం లేదని జేడీ వ్యాఖ్యానించారు. అందరూ అనుకుని ఆలోచన విధానాలను మార్చుకున్న వేళ.. మార్పు సాధ్యమనే విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. 
 
ఇకపోతే.. లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ మార్గం వేరని, తాను ఎంచుకున్న మార్గం వేరని, అది ఏంటన్నది 75 రోజుల తరువాతే బయట పెడతానని జేడీ చెప్పుకొచ్చారు. వేమన సూచించినట్టుగా గట్టి పట్టుదలతో పనిచేయాలని.. లక్ష్యాన్ని మధ్యలోనే వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను కూడా జేపీ మాదిరిగా విఫల నేతను అవుతానని చేసే కామెంట్లపై మాత్రం నోరు విప్పనని జేడీ క్లారిటీ ఇచ్చారు. 
 
తన రాజీనామా నిర్ణయం అనుకోకుండా తీసుకున్నది కాదని, సమాజానికి ఏదైనా చేయాలన్న బలమైన కోరికతోనే ఏడేళ్ల సర్వీస్‌ను వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు జేడీ తెలిపారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ వస్తాయని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. ప్రజల్లో క్షణికానందం పోయిన రోజు అది కూడా సాధ్యమవుతుందని జేడీ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయాలపై రెండున్నర నెలల తర్వాత చెప్తానని, వెయిట్ అండ్ వాచ్ అంటూ ఓ ఇంటర్వ్యూలో జేడీ తెలిపారు. 
 
వ్యవసాయంపై ప్రస్తుతం దృష్టి పెట్టానని.. రైతులకు ఏదైనా మేలు కలిగించే చర్యలు తీసుకోవాలని జేడీ తెలిపారు. ముందు తన సామర్థ్యాన్ని లెక్కించుకుంటున్నానని, తాను ఏం చేయగలనన్న విషయమై అవగాహన వచ్చిన తరువాత ఓ నిర్ణయం తీసుకుంటానని జేడీ వెల్లడించారు.