శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By Srinivas
Last Modified: సోమవారం, 7 మే 2018 (19:24 IST)

ఎన్.ఆర్.ఐలు గ్రామాలు దత్తత తీసుకోండి... సీబీఐ మాజీ జె.డీ లక్ష్మీనారాయణ పిలుపు

శ్రీకాకుళం జిల్లాలో నాలుగు రోజుల పర్యటన క్షేత్రస్థాయిలో ఉన్న ఎన్నో సమస్యలు తెలుసుకునే వీలుకలిగిందని తెలిపారు లక్ష్మీనారాయణ. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న సహలాల పుట్టుగ గ్రామాన్ని దత్తత తీసుకున్నానని, ఉద్ధానం ప్రాంతంలోని గ్రామాలన్నింటినీ దత్తత తీసుకుంటే

శ్రీకాకుళం జిల్లాలో నాలుగు రోజుల పర్యటన క్షేత్రస్థాయిలో ఉన్న ఎన్నో సమస్యలు తెలుసుకునే వీలుకలిగిందని తెలిపారు లక్ష్మీనారాయణ. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న సహలాల పుట్టుగ గ్రామాన్ని దత్తత తీసుకున్నానని, ఉద్ధానం ప్రాంతంలోని గ్రామాలన్నింటినీ దత్తత తీసుకుంటే సమస్య పరిష్కారం సులభతరమవుతుంది. అందుకు  ఎన్నారై లు ముందుకు రావాలని కోరారు. 
 
టెక్కలి మహిళా కళాశాలలో టాయిలెట్ వంటి కనీస వసతులు లేకపోవడమే పరిస్థితికి అద్దంపడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో విద్యాలయాలు ఉంటే పిల్లలు చదువును ఎలా కొనసాగిస్తారు. క్షేత్రస్థాయిలో లోపాల వల్లే ఇటువంటి పరిస్థితిలు గ్రామాల్లో నెలకొన్నాయని మీడియా సమావేశంలో తెలిపారు.