శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By selvi
Last Updated : సోమవారం, 16 ఏప్రియల్ 2018 (09:24 IST)

కేకేఆర్‌పై రాజస్థాన్ గెలుపు.. 92 పరుగులతో అదరగొట్టిన సంజు శాంసన్

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 19 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్‌ను సొంతగడ్డపై ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓ

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 19 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్‌ను సొంతగడ్డపై ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 217 పరుగులు సాధించింది. రాజస్థాన్ ఆటగాళ్లలో సంజు శాంసన్ (92) సిక్సర్లతో విరుచుకుపడి ఆడి బెంగళూరు ముందు భారీ లక్ష్యాన్ని వుంచడంలో కీలక పాత్ర పోషించాడు.
 
ఇక 218 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ ఆరువికెట్లు నష్టపోయి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది.  బెంగళూరు కెప్టెన్ కోహ్లీ 30 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 57 పరుగులు, మన్‌దీప్ సింగ్ 26 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌తో 47 పరుగులు,  వాషింగ్టన్ సుందర్ 19 బంతుల్లో 1 ఫోరు మూడు సిక్స్‌లతో35 పరుగులుచేసి రాణించినా లక్ష్యాన్ని చేధించడంలో కోల్‌కతా విఫలమైంది.