రాజస్థాన్‌లో చిత్తుగా ఓడిన బీజేపీ...
రాజస్థాన్ రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీ చిత్తుగా ఓడింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాలను కోల్పోయిన బీజేపీకి... తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో కూడా తేరుకోలేని షాక్ తగిలింది
రాజస్థాన్ రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీ చిత్తుగా ఓడింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాలను కోల్పోయిన బీజేపీకి... తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో కూడా తేరుకోలేని షాక్ తగిలింది.
రాజస్థాన్‌లో ఆరు కార్పొరేటర్ స్థానాలకు, ఆరు జిల్లా పరిషత్ స్థానాలకు, 21 పంచాయతీ సమితి స్థానాలకు ఉపఎన్నికలు జరుగగా అత్యధిక స్థానాలను సొంతం చేసుకుని కాంగ్రెస్ సత్తా చాటింది.
ఆరు కార్పొరేటర్ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించగా, నాలుగు కాంగ్రెస్, రెండు బీజేపీ గెల్చుకున్నాయి. ఆరు జిల్లా పరిషత్ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా, నాలుగు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా, బీజేపీ ఒకటి, ఇండిపెండెంట్ ఒకటి గెల్చుకున్నారు.
ఇక 21 పంచాయతీ సమితి స్థానాలకు ఉపఎన్నిక నిర్వహించగా, కాంగ్రెస్ 12, బీజేపీ 8, ఇండిపెండెంట్ ఒకటి గెలుచుకున్నారు. ఈ ఫలితాలు రాష్ట్ర బీజేపీ నాయకులకు ఒకింత షాక్‌కు గురిచేశాయి.