మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 మార్చి 2018 (12:19 IST)

దేశంలో లెఫ్ట్ పార్టీలకు చోటు లేకుండా చేస్తాం : అమిత్ షా

దేశంలో వామపక్ష పార్టీలకు చోటు లేకుండా చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జోస్యం చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం విడ

దేశంలో వామపక్ష పార్టీలకు చోటు లేకుండా చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జోస్యం చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో బీజేపీ రెండు చోట్ల విజయభేరీ మోగించింది. 
 
ఈ ఫలితాలపై ఆయన మాట్లాడుతూ, త్రిపుర ఎన్నికల్లో బీజేపీ విజయానికి ప్రధాని నరేంద్ర మోడీ 'యాక్ట్ ఈస్ట్ పాలసీ'నే కారణమన్నారు. వివిధ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయానికి దోహదపడుతుందన్నారు. తమకు విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
 
నరేంద్ర మోడీ నాయకత్వంపై ఈశాన్య రాష్ట్రాల ప్రజలు అచంచల విశ్వాసంతో ఉన్నారన్నారు. ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ రోజురోజుకు కునారిల్లుతోందని, తాజా ఎన్నికల్లో అది నిరూపితమైందన్నారు. త్రిపుర, నాగాలాండ్‌లలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. అనేక చోట్ల ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు.