మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By selvi
Last Updated : మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (17:19 IST)

ఐపీఎల్‌కు కావేరి సెగ: మ్యాచ్ జరిగితే.. స్టేడియంలో పాములు వదులుతాం..

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్-11 సమరం ప్రారంభమైంది. అయితే చెన్నైలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లకు కావేరి సెగ తగిలింది. ఐపీఎల్-11వ సీజన్లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం (చేపాక్) వేదికగా మంగళవారం చెన్నై సూ

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్-11 సమరం ప్రారంభమైంది. అయితే చెన్నైలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లకు కావేరి సెగ తగిలింది. ఐపీఎల్-11వ సీజన్లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం (చేపాక్) వేదికగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్లు తలపడనున్నాయి. రెండేళ్ల నిషేధానికి తర్వాత ఐపీఎల్‌లోకి పునరాగమనం చేసిన చెన్నై జట్టు సొంతగడ్డపై మంగళవారం రాత్రి 8 గంటలకు కేకేఆర్‌తో ఆడనుంది. 
 
కానీ రాష్ట్రంలో కావేరి జలాల వివాదం నడుస్తుండటంతో చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించరాదంటూ తమిళనాడు ప్రజలు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు ఆందోళన చేస్తున్నారు. అలా కాదని ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహిస్తే.. స్టేడియంలో పాములు వదులుతామని తమైజా వాజ్వురిమాయి కట్చి (టీవీకే) నేత, చీఫ్ వేల్‌మురుగన్ హెచ్చరించారు. కాగా... తమిళనాడు ఆందోళనల నేపథ్యంలో మ్యాచ్‌ నిర్వహించే చిదంబరం స్టేడియం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.