శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By pnr
Last Updated : మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (16:25 IST)

ఐపీఎల్ 2018 : సొంతగడ్డపై ధనాధన్ ధావన్.. సన్‌రైజర్స్ విక్టరీ

ఇండియన్ ప్రీమయర్ లీగ్ 11వ అంచ పోటీల్లో భాగంగా సోమవారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయభేరీ మోగించింది. సొంతగడ్డపై ఆడిన హైదరాబాద్ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్, కెప్టెన్ విలియమ్

ఇండియన్ ప్రీమయర్ లీగ్ 11వ అంచ పోటీల్లో భాగంగా సోమవారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయభేరీ మోగించింది. సొంతగడ్డపై ఆడిన హైదరాబాద్ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్, కెప్టెన్ విలియమ్సన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫలితంగా 9 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లలో 125 చేసింది. ఆ తర్వాత 126 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించింది. కేన్ విలియమన్స్ సారథ్యంలోని రైజర్స్ బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ ఇలా అన్ని రంగాల్లో సత్తా చాటి లీగ్‌ను గొప్పగా మొదలెట్టింది. 
 
అనంతరం లక్ష్య ఛేదనలో ఓపెనర్ శిఖర్ ధావన్(77 నాటౌట్) ధానధన్ బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. దీంతో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేత ధావన్ తన ట్రేడ్‌మార్క్ షాట్లతో బౌండరీలు బాది సన్‌రైజర్స్‌ను గెలుపు బాటలో నడిపించాడు. విలియమ్సన్(36 నాటౌట్) జోడీగా రెండో వికెట్‌కు 121 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ధావన్ బౌండరీతో గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు.