శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By ivr
Last Modified: గురువారం, 5 ఏప్రియల్ 2018 (19:20 IST)

ఐపీఎల్ 2018 ఓపెనింగ్ సెర్మనీ: జూ.ఎన్టీఆర్-తమన్నా పెర్ఫార్మ్ చేయనున్నారా?

ఐపీఎల్ 2018 క్రీడా పోటీలు శనివారం నాడు ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. పొట్టి క్రికెట్ పోటీల ఓపెనింగ్ సెర్మనీ ముంబైలోని వాంఖెడే స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్నాయి. సుమారు 90 నిమిషాలు పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఐతే ఈ కార్యక్రమ ప్రారం

ఐపీఎల్ 2018 క్రీడా పోటీలు శనివారం నాడు ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. పొట్టి క్రికెట్ పోటీల ఓపెనింగ్ సెర్మనీ ముంబైలోని వాంఖెడే స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్నాయి. సుమారు 90 నిమిషాలు పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఐతే ఈ కార్యక్రమ ప్రారంభంలో అలరించేందుకు సినీ స్టార్లు పాల్గొనడం మామూలే. 
 
ఈసారి ఓపెనింగ్ సెర్మనీలో పరిణితీ చోప్రా, శ్రద్ధా కపూర్ తదితర బాలీవుడ్ తారలు పాల్గొంటారని చర్చించుకున్నారు. ఐతే ఇప్పుడు మరో చర్చ కూడా స్టార్టయింది. అదేమిటంటే... తాజాగా ఐపీఎల్ 2018 తెలుగుకు బ్రాండ్ అంబాసిడర్ అయిన జూనియర్ ఎన్టీఆర్, తమన్నాతో కలిసి ఓపెనింగ్ సెర్మనీలో పెర్ఫార్మ్ చేయనున్నారని. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే శనివారం దాకా ఆగాల్సిందే.