సోమవారం, 6 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By ivr
Last Modified: గురువారం, 5 ఏప్రియల్ 2018 (13:53 IST)

ఐపీఎల్ తెలుగు ప్రచారకర్త జూ.ఎన్టీఆర్...

ఐపీఎల్ సందడి మొదలైంది. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే... ఐపీఎల్ మ్యాచ్‌లు తొలిసారిగా తెలుగులో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఐపీఎల్ నిర్వాహకులు హైదారాబాదులోని పార్క్ హయత్ హోటల్లో సమావేశం నిర్వహించారు. మరో విశేషం ఏమిటంటే... ఐపీఎల్ మ్యాచ్‌ల తె

ఐపీఎల్ సందడి మొదలైంది. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే... ఐపీఎల్ మ్యాచ్‌లు తొలిసారిగా తెలుగులో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఐపీఎల్ నిర్వాహకులు హైదారాబాదులోని పార్క్ హయత్ హోటల్లో సమావేశం నిర్వహించారు. మరో విశేషం ఏమిటంటే... ఐపీఎల్ మ్యాచ్‌ల తెలుగు ప్రచార‌క‌ర్త‌గా జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎంపిక కావడం. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ... తన ఫేవరెట్ క్రికెటర్ స‌చిన్ టెండూల్కర్ అని చెప్పారు.
 
క్రికెట్ క్రీడలో చాలామంది గొప్ప క్రికెటర్లు ఉన్నారని చెప్పిన ఎన్టీఆర్ తనకు క్రికెట్ పట్ల ఆసక్తి, అవగాహన కలిగే వయసు వచ్చినప్పుడు సచిన్ టెండూల్కర్ ఆట కోసం ఎగబడి చూసేవాడినని చెప్పుకొచ్చారు. ఐతే ఇప్పుడు తనకు చాలామంది క్రికెటర్లంటే ఇష్టమని అన్నారు. మహేంద్ర సింగ్ ధోనీ ఆట తీరు అద్భుతంగా వుంటుందని వ్యాఖ్యానించాడు. 
 
తన విషయానికి వస్తే సింహాద్రి చిత్రం హిట్ అయినప్పుడు సిక్స్ కొట్టినంత ఉత్సాహం వచ్చిందన్నారు. అలాగే తను క్రికెట్లో డౌకట్ అయినట్లు ప్లాపులు కూడా వున్నాయన్నారు. ఏదేమైనా గెలుపు ఓటములను సమానంగా తీసుకుని ముందుకు వెళ్లడమే క్రీడా స్ఫూర్తి అని చెప్పారు.