మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (17:52 IST)

రాజమౌళి మల్టీస్టారర్‌పై జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నారు? సచిన్, ధోనీ అంటే?

బాహుబలి దర్శకుడు రాజమౌళి తాజాగా మల్టీస్టారర్ సినిమాను రూపొందించే పనిలో వున్నారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సోదరులుగా నటించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు

బాహుబలి దర్శకుడు రాజమౌళి తాజాగా మల్టీస్టారర్ సినిమాను రూపొందించే పనిలో వున్నారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సోదరులుగా నటించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని రూ.250 కోట్లతో నిర్మించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రం కోసం భారీ మొత్తం వెచ్చించాలని డీవీవీ దానయ్య పక్కా ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం.
 
ఈ సినిమా గురించి ఇంకా అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా..  ఈ చిత్రం గురించి జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. రాజమౌళి ఇంకా తనకు సినిమా కథ పూర్తిగా చెప్పలేదని.. సినిమాకు సిద్ధం కావాలన్నారని చెప్పారు.
 
ఇకపోతే.. కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ మ్యాచ్‌ల తెలుగు ప్రచార‌క‌ర్త‌గా ఎన్నికైన‌ జూనియ‌ర్ ఎన్టీఆర్.. మంగళవారం ఐపీఎల్ నిర్వాహ‌కులు హైద‌రాబాద్‌లోని పార్క్ హయత్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తనకు ఎలాంటి పిలుపు రాలేదని చెప్పారు. కాగా, క్రికెటర్ల జీవితాలు తెరపై రావడం సంతోషంగా ఉందని, అయితే, వారి బయోపిక్స్ చేయడానికి తాను సాహసం చేయబోనని తేల్చేశారు. ఇంకా తన ఫేవరెట్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అని.. ధోనీ అంటేనూ ఇష్టమేనని తెలిపారు. 
 
చాలామంది గొప్ప క్రికెటర్లు ఉన్నారని, వారిని తక్కువ చేసి మాట్లాడట్లేదని యంగ్ టైగర్ వెల్లడించారు. ఆట కూడా ఓ భాషేనని తన అభిప్రాయమన్నారు. సినిమాల్లో డకౌట్లయిన సందర్భాలున్నాయని తెలిపారు. సింహాద్రి సినిమా హిట్ టాక్ రాగానే సిక్స్ కొట్టినట్లు అనిపించిందని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.