గురువారం, 5 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By selvi
Last Updated : శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (13:16 IST)

క్రిస్ గేల్ అదుర్స్ సెంచరీ.. క్రిసాలినాకు అంకితం.. చిన్న పాపాయికి?

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గురువారం మొహాలీలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ ‌గేల్ అదరగొట్టాడు. పంజాబ్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ ఇన్నింగ్స్‌కు స్కోర్ బోర్డు పరుగులు పెట

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గురువారం మొహాలీలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ ‌గేల్ అదరగొట్టాడు. పంజాబ్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ ఇన్నింగ్స్‌కు స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.

ప్రతిసారీ స్టాండ్స్‌లోకి వెళ్లి పడుతున్న బంతి కోసం ఫీల్డర్లు పరుగులు పెట్టారు. ఏకంగా నాలుగు సిక్సర్లు బాదాడు. కేవలం 63 బంతుల్లో ఒక ఫోర్, 11 సిక్సర్లతో సెంచరీ (104) పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ ఏడాది ఐపీఎల్‌లో తొలి శతకాన్ని నమోదు చేసుకున్నాడు. దీంతో పంజాబ్ గెలుపులో క్రిస్ గేల్ కీలక పాత్ర పోషించాడు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అనంతరం 194 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.
 
సన్‌రైజర్స్‌పై గెలుపును నమోదు చేసుకున్న తర్వాత సూపర్ సెంచరీతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న క్రిస్ గేల్ మాట్లాడుతూ.. ఈ శతకం తన కుమార్తె క్రిసాలినాకు అంకితం చేస్తున్నానని చెప్పాడు. ఎందుకంటే శుక్రవారం క్రిసాలినాకు రెండో పుట్టినరోజు జరుపుకుంటోంది. శుక్రవారం వీలైనంత ఎక్కువ సమయాన్ని క్రిసాలినాతోనే గడుపుతానని క్రిస్ గేల్ తెలిపాడు. 
 
ఈ సీజన్‌లో ఆడిన రెండో మ్యాచ్‌లో సొంతగడ్డపై శతకం సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు. కాగా మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ, సెంచరీ చేసినప్పుడు తన బ్యాట్‌ను రెండు చేతుల్లోకి తీసుకొని చిన్న పాపాయికి జోలపాడుతున్నట్లు క్రిస్ గేల్ కనిపించి ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు.