1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 జులై 2025 (10:19 IST)

హానీట్రాప్‌లో పడిపోయాడు.. ఆర్మీ సీక్రెట్లు చెప్పేశాడు.. చివరికి పోలీసులకు చిక్కాడు..

Honey Trap
Honey Trap
హానీట్రాప్‌లో చిక్కుకున్నాడు ఓ ఆర్మీ కాంట్రాక్ట్ ఉద్యోగి. దేశ రక్షణకు సంబంధించి రహస్య సమాచారాన్ని ఇతరులకు పంపించినట్లు పోలీసులు నిర్ధారించారు. అవతలి వ్యక్తి మహిళ అనుకొని మల్లికార్జున్ రెడ్డి వలపు వలలో చిక్కుకున్నట్లు పేర్కొన్నారు. 
 
వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌కు చెందిన దుక్కా మల్లికార్జున్ రెడ్డి 2020లో ఓ ప్రాజెక్టు కోసం డీఆర్‌డీఎల్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేరాడు.2022లో ఫేస్‌బుక్ ద్వారా నటాషారావు అలియాస్ సిమ్రాన్ చోప్రాతో అతడికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. 
 
అలా హనీట్రాప్‌లో మల్లికార్జున్ చిక్కుకున్నాడు. 6 నెలల పాటు విదేశీ ఐపీ అడ్రస్‌తో మల్లికార్జున్ తరచూ మాట్లాడటంతో నిఘా సంస్థలు దీన్ని గుర్తించాయి. చివరికి బాలాపూర్ పోలీసులు 2022 జులైలో అతడిని అరెస్టు చేశారు. అతడి ఫోన్ డేటాను సైబర్ ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో రీట్రీవ్ కూడా చేయించారు. చివరికి అతడు దేశ భద్రతకు సంబంధించి రహస్య సమాచారం పంపించినట్లు తేల్చారు.