క్రిస్ గేల్‌ను సొంతం చేసుకోవడం మా అదృష్టం : ప్రీతి జింటా
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ టోర్నీలో సిక్సర్లు, ఫోర్ల మోగుతోంది. పలువురు యువ క్రికెటర్లతో పాటు.. సీనియర్ క్రికెటర్లు కూడా తమ శక్తిమేరకు రాణిస్తూ సిక్సర్లు బాదుతున్నారు. తాజాగా క్రిస్ గేల్ ఆడిన సుడిగాల
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ టోర్నీలో సిక్సర్లు, ఫోర్ల మోగుతోంది. పలువురు యువ క్రికెటర్లతో పాటు.. సీనియర్ క్రికెటర్లు కూడా తమ శక్తిమేరకు రాణిస్తూ సిక్సర్లు బాదుతున్నారు. తాజాగా క్రిస్ గేల్ ఆడిన సుడిగాలి ఇన్నింగ్స్‌పై బాలీవుడ్ నటి, పూణె జట్టు సహ అధిపతి ప్రీతి జింటా తెగ సంబరపడిపోయింది. ముఖ్యంగా, 38 ఏళ్ల వయసులోనూ క్రిస్ గేల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును చిత్తుచేశాడు. గేల్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ చూసి ఐపీఎల్‌లోని మిగతా ఫ్రాంచైజీలన్నీ తెగ బాధపడి ఉంటాయి. ఐపీఎల్‌లో ఇతన్ని అనవసరంగా మిస్ చేసుకున్నామా.. అని ఆయా ఫ్రాంచైజీల ఓనర్లు ఫీలై ఉంటారు.
ఈ సంవత్సరం జరిగిన వేలంలో రెండు రౌండ్లలో అసలు గేల్‌ను పట్టించుకున్నవాళ్లే లేరు. ఐపీఎల్‌తోపాటు టీ20ల్లో ఎవరికీ సాధ్యం కాని ఎన్నో రికార్డులు అతని పేరు మీద ఉన్నా.. ఫ్రాంచైజీలు అతనిపై ఆసక్తి చూపలేదు. బహుశా గేల్ వయసును చూసి వాళ్లు వెనకడుగు వేసుంటారు. అయితే ఆటకు వయసుతో సంబంధం లేదని గేల్ ఈ సెంచరీతో నిరూపించాడు. అతనికి టీ20ల్లో ఇది 21వ సెంచరీ. మూడో రౌండ్‌లో అతని బేస్ ప్రైస్ 2 కోట్లకే గేల్‌ను దక్కించుకున్న కింగ్స్ పంజాబ్ టీమ్.. తెగ మురిసిపోతోంది. గేల్‌ను ఎవరూ తీసుకోకపోవడం మా అదృష్టం అని ప్రీతి జింటా వ్యాఖ్యానించింది.
ఇదే విషయంపై గేల్ మాట్లాడుతూ చాలా మంది నేను ముసలివాడినైపోయానని అనుకున్నారు. ఈ ఇన్నింగ్స్ తర్వాత నేను కొత్తగా నిరూపించుకోవాల్సింది ఇక ఏమీ లేదు. ఈ సెంచరీ నా కూతురికి అంకితం. శుక్రవారం (ఏప్రిల్-20) ఆమె బర్త్‌డే. నేను కింగ్స్ పంజాబ్ టీమ్‌లో జాయిన్ అయినప్పటి నుంచీ సెహ్వాగ్ నాకు ఒకటే చెబుతున్నాడు. యోగా, మసాజ్ చేసే వ్యక్తులతోనే ఎక్కువగా గడపమని చెప్పాడు. నా సక్సెస్‌కు అదే కారణం అనుకుంటా అని మ్యాచ్ తర్వాత గేల్ నవ్వుతూ చెప్పాడు. నేనేదో నిరూపించుకోవాలని చాలా మంది అన్నారు. నన్ను ఎంచుకొని సెహ్వాగ్ ఐపీఎల్‌ను కాపాడాడు.
నేను ఎవరికో ఏదో నిరూపించాలని ఇక్కడికి రాలేదు. నా క్రికెట్‌ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నా అని గేల్ తనదైన స్టెల్లో చెప్పాడు. ఐపీఎల్‌లో గేల్ ఇప్పటివరకు 19 హాఫ్ సెంచరీలు, 6 సెంచరీలు చేశాడు. సన్ రైజర్స్ పై 63 బంతుల్లోనే గేల్ సెంచరీ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 సిక్సర్లు, ఒక ఫోర్ ఉన్నాయి. టీమ్ స్కోరు 193లో సగానికిపైగా గేల్ చేయడం విశేషం. మిగతా ఫ్రాంచైజీల సంగతేమోగానీ.. అతన్ని వదిలేసినందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాత్రం ఖచ్చితంగా ఎంతగానో ఫీలవుతూ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.