బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2017 (16:47 IST)

క్రిస్ గేల్‌కు అనుకూలమైన తీర్పు: ఆకట్టుకునే కథనాలు రాస్తారే కానీ? మీడియాపై కోర్టు సీరియస్

2015 ప్రపంచకప్ సందర్భంగా క్రిస్ గేల్ డ్రెసింగ్‌ రూమ్‌లో మసాజ్‌ థెరపిస్ట్‌కు తన మర్మాంగాన్ని చూపించి అసభ్యంగా ప్రవర్తించాడని గత జనవరిలో ఫెయిర్‌ఫాక్స్‌ మీడియాకు చెందిన పత్రికలు సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ

2015 ప్రపంచకప్ సందర్భంగా క్రిస్ గేల్ డ్రెసింగ్‌ రూమ్‌లో మసాజ్‌ థెరపిస్ట్‌కు తన మర్మాంగాన్ని చూపించి అసభ్యంగా ప్రవర్తించాడని గత జనవరిలో ఫెయిర్‌ఫాక్స్‌ మీడియాకు చెందిన పత్రికలు సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌, ద ఏజ్‌, ద కాన్‌బెర్రా టైమ్స్‌ పేర్కొన్నాయి. 
 
అయితే గేల్ డ్రస్సింగ్ రూమ్‌లో తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ఈ పత్రికలు ఇష్టమొచ్చినట్లు రాస్తున్నాయని.. ఓ ఆస్ట్రేలియా మీడియా గ్రూపు తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని.. క్రిస్ గేల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు గేల్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. 
 
అంతేగాకుండా మీడియాపై కోర్టు సీరియస్ అయ్యింది. పాఠకులను ఆకట్టుకునే విధంగా కథనాలు రాస్తున్నారే తప్ప.. అందులో ఎంతమేరకు నిజం వుందో అనే దానిపై మీడియా దృష్టి పెట్టట్లేదని.. దేశానికి ప్రాతినిథ్యం వహించే వ్యక్తి పట్ల అప్రమత్తత లేకుండా ఎలా వ్యవహరిస్తారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తీర్పు పట్ల క్రిస్ గేలే హర్షం వ్యక్తం చేశారు.