గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 16 అక్టోబరు 2017 (15:07 IST)

ట్రిపుల్ సెంచరీతో క్లబ్ క్రికెటర్ అదరగొట్టాడు.. ఓన్లీ సిక్సర్లతో 240 పరుగులు

ఆస్ట్రేలియాలో ఓ క్లబ్ క్రికెటర్ ఏకంగా 240 పరుగుల సిక్సర్ల ద్వారానే సాధించి... ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాకు చెందిన జోష్ డన్ స్టన్ అనే క్లబ్ క్రికెటర్ (బీ గ్రేడ్ క్రికెటర

ఆస్ట్రేలియాలో ఓ క్లబ్ క్రికెటర్ ఏకంగా 240 పరుగుల సిక్సర్ల ద్వారానే సాధించి... ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాకు చెందిన జోష్ డన్ స్టన్ అనే క్లబ్ క్రికెటర్ (బీ గ్రేడ్ క్రికెటర్) బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. బ్యాటింగ్‌తో విజృంభించాడు. అతని ఆటను చూసిన వారంతా ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు. 240 పరుగులను సిక్స్‌ల ద్వారానే చితక్కొట్టడం ద్వారా బౌలర్లకు చుక్కలు చూపించాడు. 
 
ఆస్ట్రేలియాలో జరిగిన ఓ క్లబ్ మ్యాచ్ సందర్భంగా ఆకాశమే హద్దుగా చెలరేగిన డన్ స్టన్ 307 పరుగులతో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో ఏకంగా 40 సిక్సర్లు బాదాడు. డన్ స్టన్ స్కోర్ 203 పరుగుల నుంచి 307కి చేరుకునే సమయంలో అవతలి ఎండ‌లో వున్న బ్యాట్స్‌మెన్ చేసిన స్కోరు కేవలం ఐదు పరుగులు మాత్రమే. అంతకుముందు బ్యాటింగ్ చేసి ఐదుగురు బ్యాట్స్‌మెన్లు అందరూ కలిపి 47 పరుగులు మాత్రమే సాధించడం గమనార్హం.