సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 6 మే 2018 (10:15 IST)

వరుస విజయాలతో సన్ రైజర్స్ గ్రాండ్ విక్టరీ... పట్టికలో అగ్రస్థానం

ఐపీఎల్ 2018లో భాగంగా, హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. శనివారం హైదరాబాద్, ఉప్పల్ స్టేడియం వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించిం

ఐపీఎల్ 2018లో భాగంగా, హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. శనివారం హైదరాబాద్, ఉప్పల్ స్టేడియం వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది.
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ … ఒక బాల్ మిగిలి ఉండగానే టార్గెట్‌ను ఫినిష్ చేసి విజయం అందుకొంది. తద్వారా తమకు ఎదురులేదని మరోసారి నిరూపించింది. 
 
కాగా, ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 9 మ్యాచ్‌‌లు ఆడిన సన్‌ రైజర్స్‌… 7 విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌‌ను ఆక్రమించింది. ప్లే ఆఫ్‌ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది. ఆ తర్వాత స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 10 మ్యాచ్‌లు ఆడి 7 మ్యాచ్‌లలో విజయం సాధించి 14 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.