ధోనీ సేనతో ఢీకొట్టేందుకు ఇది మాకు బూస్ట్... అనుష్కకు గిఫ్ట్ అన్న కోహ్లి
విరాట్ కోహ్లి సేన చాలా కష్టపడి మంగళవారం నాడు ముంబై ఇండియన్స్ పైన విజయం సాధించాయి. విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ పుట్టినరోజు కానుకగా ఈ మ్యాచ్ గెలుపును ఆమెకు బహుమతిగా ఇస్తున్నట్లు రాయల్ ఛాలెంజెర్స్ కె
విరాట్ కోహ్లి సేన చాలా కష్టపడి మంగళవారం నాడు ముంబై ఇండియన్స్ పైన విజయం సాధించాయి. విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ పుట్టినరోజు కానుకగా ఈ మ్యాచ్ గెలుపును ఆమెకు బహుమతిగా ఇస్తున్నట్లు రాయల్ ఛాలెంజెర్స్ కెప్టెన్ కోహ్లి అనడంతో గ్యాలెరీ మార్మోగిపోయింది. ముంబై ఇండియన్స్ పైన బెంగళూరు 14 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఇకపోతే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ కావడంతో కోహ్లి తన జట్టు సహచరులకు క్లాస్ పీకాడట. ఎలాగైనా ప్రత్యర్థి జట్టును ఓడించాలనీ, బౌలర్లంతా చాలా చురుకుగా ఆడాలని సూచనలు చేశాడట. మంగళవారం నాటి విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో ఐదో స్థానాన్ని దక్కించుకుని ధోనీ సేనతో తలపడనుంది. కాగా ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లాడిన బెంగళూరు జట్టుకు ఇది కేవలం మూడో విజయం కావడం గమనార్హం. మరోవైపు వరుస విజయాలతో అగ్రస్థానాన వున్న ధోనీ సేనతో మే 5న విరాట్ సేన తలపడనుంది.