శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 1 మే 2018 (17:22 IST)

అమెరికా చావ్లాపై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు.. అమెరికా వీర మహిళ అని కితాబు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత సంతతికి చెందిన వ్యోమగామి కల్పనా చావ్లాపై ప్రశంసల జల్లు కురిపించారు. కల్పనా చావ్లా స్పేస్ షటిల్‌తో పాటు వేర్వేరు ప్రయోగాల కోసం అంకితభావంతో పనిచేశారని ట్రంప్ కొ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత సంతతికి చెందిన వ్యోమగామి కల్పనా చావ్లాపై ప్రశంసల జల్లు కురిపించారు. కల్పనా చావ్లా స్పేస్ షటిల్‌తో పాటు వేర్వేరు ప్రయోగాల కోసం అంకితభావంతో పనిచేశారని ట్రంప్ కొనియాడారు. ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి వచ్చి అమెరికానే తమ సొంత దేశంగా మార్చుకున్న వారి కారణంగా తమ దేశం ఎంతో లాభపడిందని తెలిపారు. 
 
కల్పనాచావ్లా అమెరికా వీర మహిళ అని.. లక్షలాది మంది బాలికల్లో ఆమె స్ఫూర్తి నింపారని ప్రశంసించారు. రోదసీలోకి వెళ్లిన తొలి భారత సంతతి మహిళ అని కల్పనా చావ్లాను కొనియాడారు. 2003లో స్పేస్‌ షటిల్‌ కొలంబియా ప్రమాదంలో మృతి చెందిన ఆమెను అమెరికా చట్ట సభలతోపాటు నాసా అనేక పురస్కారాలతో సత్కరించాయన్న విషయాన్ని ట్రంప్ గుర్తు చేసుకున్నారు. 
 
ఇదిలా ఉంటే.. కల్పనా చావ్లా 1962 మార్చి 17 న హరియాణాలోని కర్నాల్‌లో ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. అంతరిక్షయానం చేసిన ఇండో-అమెరికన్ మహిళ వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన కల్పనా చావ్లా కొలంబియా స్పేస్ షటిల్ ప్రమాదంలో మరణించి 13 సంవత్సరాలైంది.

2003 ఫిబ్రవరి1న అంతరిక్షం నుంచి తిరిగివస్తూ కొలంబియా నౌక ప్రమాదానికి గురికావడంతో కల్పనా చావ్లాతో పాటు ఆరుగురు వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.