ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 1 మే 2018 (16:33 IST)

ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్.. రూ.129తో 1జీబీ.. 4జీ డేటా.. 100 ఎస్సెమ్మెస్‌లు ఫ్రీ

ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్ ప్రకటించింది. హలో ట్యూన్స్ కోరుకునే వారి కోసం రూ.129తో కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. రూ.129 ప్లాన్‌లో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 1జీబీ 4జీ డేటా, రోజూ 100

ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్ ప్రకటించింది. హలో ట్యూన్స్ కోరుకునే వారి కోసం రూ.129తో కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. రూ.129 ప్లాన్‌లో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 1జీబీ 4జీ డేటా, రోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు పొందొచ్చు. వ్యాలిడిటీ 28 రోజులు.

తమకు కాల్ చేసిన వారికి కాలర్ ట్యూన్లను వినిపించాలని ఆశించే వారి కోసం ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇటీవలే రూ.219తోనూ ఈ కంపెనీ ప్లాన్‌ను ప్రకటించిన విషయం గుర్తుండే వుంటుంది. 
 
అయితే కస్టమర్ కేర్‌కు కాల్‌చేసి విచారించిన తర్వాతనే రీఛార్జ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే రూ.129 రీఛార్జ్‌కు 220 నిమిషాల లోకల్, ఎస్టీడీ నిమిషాల టాక్ టైమ్‌ను ఎయిర్‌టెల్ ఆఫర్ చేస్తోంది. కొత్త ప్యాక్ గురించి విచారించుకోకుండా రీచార్జ్ చేసుకుంటే వాయిస్ కాల్ ప్యాక్ మాత్రమే యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది.