ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 ఏప్రియల్ 2018 (14:47 IST)

అమ్మతోడు.. హైదరాబాద్‌లో అమ్మాయిలకు ఇళ్లు అద్దెకివ్వరట...

దేశంలో ఉన్న ప్రధాన ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ముఖ్యంగా, దేశానికి రెండో రాజధానిగా ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. అలాగే, అంతర్జాతీయంగా హైదరాబాద్ నగరానికి మంచి గుర్తింపు ఉంది.

దేశంలో ఉన్న ప్రధాన ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ముఖ్యంగా, దేశానికి రెండో రాజధానిగా ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. అలాగే, అంతర్జాతీయంగా హైదరాబాద్ నగరానికి మంచి గుర్తింపు ఉంది. అలాంటి భాగ్యనగరంలో అమ్మాయిలకు అద్దెకు ఇళ్లు దొరగడం లేదు. ఈ విషయం 'నెస్ట్‌అవే' అనే సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది.
 
ముఖ్యంగా, ఒంటరి మహిళకు అద్దె ఇల్లు ఇవ్వడానికి ఇంటి యజమానులు నిరాకరిస్తున్నారు. ఇందుకు అనేక కారణాలు చెపుతున్నారు. ఈ సర్వే చేయడానికి వేర్వేరు నగరాల్లోని వేర్వేరు ప్రాంతాల్లోని మహిళా ఉద్యోగులను ఎంచుకుని అభిప్రాయాలు తీసుకుని ఈ వివరాలు వెల్లడించారు. 
 
హైదరాబాద్‌లో మాదాపూర్, శంషాబాద్, గచ్చిబౌలి ప్రాంతాలలో ఉంటోన్న మహిళా ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఒకవేళ ఇళ్లు లభించినా వారి సంపాదనలో సగం ఇంటి అద్దెలకే చెల్లిస్తున్నట్టు తేలింది. అదేసమయంలో మహిళలకు భద్రత కల్పిస్తున్న నగరాల్లో హైదరాబాద్ తరువాతి స్థానంలో పూణె, బెంగుళూరులు చోటుదక్కించుకున్నాయి.