శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By pnr
Last Updated : బుధవారం, 2 మే 2018 (11:30 IST)

ఐపీఎల్ 2018 : బెంగుళూరు గెలిచింది.. అనుష్క నవ్వింది

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 టోర్నీలో భాగంగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఎట్టకేలకు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగుళూరు జట్టు నిర్ధేశించిన 168 పరుగుల టార్గెట్‌ను ఛేదించకుండా అడ్డుకోగ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 టోర్నీలో భాగంగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఎట్టకేలకు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగుళూరు జట్టు నిర్ధేశించిన 168 పరుగుల టార్గెట్‌ను ఛేదించకుండా అడ్డుకోగలిగింది. ఫలితంగా విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. జట్టులో మనన్‌ వోహ్రా (31 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 45), మెకల్లమ్‌ (25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 37), కోహ్లీ (26 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 32) ఓ మాదిరిగా రాణించగా ఆఖరులో గ్రాండ్‌హోమ్‌ (10 బంతుల్లో 3 సిక్సర్లతో 23 నాటౌట్‌) చెలరేగాడు. 
 
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 153 పరుగులు చేసి ఓడింది. హార్దిక్‌ పాండ్యా (42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 50) రాణించాడు. సౌథీ, సిరాజ్‌, ఉమేశ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' సౌథీకి దక్కింది. ఈ గెలుపుతో విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 
 
నిజానికి పరుగుల వరద పారే చిన్నస్వామి స్టేడియంలో పటిష్ట లైనప్‌ కలిగిన ముంబై ఇండియన్స్‌ను 168 పరుగుల టార్గెట్‌ను ఛేదించకుండా బెంగుళూరు బౌలర్లు అడ్డుకోగలిగారు. డెత్‌ బౌలింగ్‌లో ఇప్పటిదాకా ధారాళంగా పరుగులు సమర్పించుకున్న బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. 
 
సౌథీ, ఉమేశ్‌, సిరాజ్‌ త్రయం సంయుక్తంగా చెలరేగి ప్రత్యర్థి పనిపట్టింది. ఈ ఓటమితో ముంబై పరిస్థితి మరింత ఇక్కట్లో పడినట్టయ్యింది. ఆ జట్టు ప్లే ఆఫ్‌కు వెళ్లాలంటే ఇక మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో తప్పక గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది.