ఇంటర్వ్యూలకు వెళ్తున్నారా? వారిని ఆకట్టుకోవాలంటే..?

కెరీర్‌లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరవుతూ వుంటాం. అయితే ఆ ఇంటర్వ్యూలో అడిగే కొన్ని ప్రశ్నలకు ఆశ్చర్యపోతుంటాం. మరికొందరైతే ఇంటర్వ్యూల్లో ఎలాంటి ప్రశ్నలేస్తారని టెన్షన్ పడుతూవుంటారు. ఉద్యోగాల కోసం క

selvi| Last Updated: శనివారం, 5 మే 2018 (14:27 IST)
కెరీర్‌లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరవుతూ వుంటాం. అయితే ఆ ఇంటర్వ్యూలో అడిగే కొన్ని ప్రశ్నలకు ఆశ్చర్యపోతుంటాం. మరికొందరైతే ఇంటర్వ్యూల్లో ఎలాంటి ప్రశ్నలేస్తారని టెన్షన్ పడుతూవుంటారు. ఉద్యోగాల కోసం కొన్ని సంస్థలు నిర్వహించే ఇంటర్వ్యూల్లో ఎలాంటి ప్రశ్నలేస్తారనే అంశంపై చాలా మందికి క్లారిటీ వుండదు.


అయితే ఇంటర్వ్యూల్లో అడిగే ప్రశ్నలను దృష్టిలో పెట్టుకుని.. ఒత్తిడికి లోనుకావడం కంటే.. ఇంటర్వ్యూ చేసే వారిని ఎలా ఆకట్టుకోవాలనే అంశంపై శ్రద్ధ పెడితే.. ఉద్యోగం సాధించవచ్చు. ఇంటర్వ్యూ చేసేవారు.. ప్రశ్నలేసేటప్పుడు.. ఎలాంటి సమాధానం ఇస్తారు..? అడిగిన ప్రశ్నపై సమాధానం తెలియక మౌనం వహిస్తారా? అనే అంశాలను గమనిస్తారు. 
 
అందుకే ఒత్తిడిని పక్కనబెట్టి ఇంటర్వ్యూ చేసే వారికి ప్రశ్నను అర్థం చేసుకుని మీ బాణీలో సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించాలి. సంస్థ గురించిన విషయాలను బేరీజు వేసుకోవాలి. ఇలా చేస్తే ఇంటర్వ్యూల కోసం గంటల పాటు సమయాన్ని వృధా చేసుకునే అవకాశం వుండదు.

ఇంకా ఇంటర్వ్యూల కోసం ప్రిపేర్ కావడం.. ఇంటర్వ్యూ చేసే వారు అందుకు విరుద్ధంగా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవడం వంటి సమస్యలను అధిగమించవచ్చు. ఇంటర్వ్యూలో వేసిన ప్రశ్నకు సంబంధించి లోతుగా ఆలోచించి.. దాని చుట్టూ సమాచారాన్ని ఎలా గీయవచ్చో తెలుసుకోవాలి. ఇలా ఇంటర్వ్యూల్లో అధిగమించాలంటే ఇంటర్వ్యూ చేసేవారిని ఆకట్టుకునే రీతిలో మీరే ఎలా ప్రశ్నలేయవచ్చో ఈ ఐదు చిట్కాలు, ఉత్తమ ప్రశ్నలేంటో చూద్దాం..
 
1. ఈ స్థితిలో ఓ వ్యక్తి విజయాన్ని మీరెలా అంచనా వేస్తారు..?
మీ పనితీరుతో మేనేజర్‌ను సంతోషంగా ఉంచేందుకు ఏం చేయాలో గమనించండి. మాట్లాడే భాష, రాసే భాష గురించి తెలుసుకోండి. లేక అనుభవం వుంటే.. ఉద్యోగ వివరాలను రాయడంపై ఎలా దృష్టి పెట్టాలో గమనించండి. దీన్నిబట్టి సంభాషణను ఎంచుకుని.. ఇంటర్వ్యూ చేసేవారితో మాట్లాడటం చేయండి.

వేర్వేరు బాధ్యతలకు సంబంధించిన ఉద్యోగాలను నిర్వర్తించడం ఓ వ్యక్తి విజయానికి ఎంతో దోహదపడుతుందని గమనించాలి. చేసే ఉద్యోగానికి, సాధించే విజయాన్ని వున్న సంబంధం.. ఇంటర్వ్యూ చేసే వారిలో చాలామందికి తెలియకపోవచ్చు. అందుచేత మీ అనుభవాన్ని మేళవించి.. ఇంటర్వ్యూ అడిగే వ్యక్తులకు తగినట్లు.. ఆకట్టుకునే రీతిలో.. వారినే ప్రశ్నించే ధోరణిలో మీ సమాధానం వుండాలని గుర్తించుకోండి. 
 
2. ఈ స్థితిలో వున్న వ్యక్తి ఎదుర్కోవాల్సిన సవాళ్లేంటి?
ముందుగానే ఉద్యోగ వివరాలకు సంబంధించి సమాచారం పొందాలి. అంతర్గత వ్యవహారాలు, రాజకీయాలు ఎదుర్కోవాలి. లేకుంటే మీరు చేస్తున్న పనికి చాలా దగ్గర కావడం కష్టం. అలాగే కఠినమైన బడ్జెట్‌ పరిమితుల్లో పనిచేయాల్సి వుంటుంది. గతంలో ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడం కూడా.. ఇంటర్వ్యూ చేసేవారిని మీరెలా సంప్రదించాలో నేర్పిస్తుంది.

ఇంటర్వ్యూకి వెళ్ళి.. వారికి మీరిచ్చే హామీ కూడా ఆ ఉద్యోగం లభించేందుకు ప్రారంభం అని కూడా చెప్పవచ్చు. ఇంటర్వ్యూల్లో కొన్ని సాధారణ ప్రశ్నలను సంధించడం ద్వారా, లేదా కంపెనీ అమ్మకాలపై ప్రశ్నలేయడం సరైన ఫలితాలను రాబట్టవు. కానీ సవాళ్లను గురించి అడగటం ద్వారా వాటిని ఎలా సంప్రదించేలా చేయవచ్చుననే నిజమైన చర్చ సాగుతుంది. 
 
3. ఇంతకుముందు పనిచేసిన వ్యక్తుల గురించి ఆలోచిస్తూ.. వారిలో మంచితనాన్ని ఎలా విభజించాలి?
ఉద్యోగ అభ్యర్థికి ఈ ప్రశ్న పదే పదే ఎదురైనా.. ఇది బలమైన ప్రశ్నే కావొచ్చు. నియామకం, నిర్వాహకులు, ఉద్యోగం చేస్తున్న వారిని కనుగొనాలనే ఆశతో అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయడం కష్టం. వారు చేసే పనిలో మాజీలు అంటే ఇంతకుముందు పనిచేసిన వారిలో వున్న మంచితనం ఇక్కడ వుందా.. అలాంటి వారు ఇక్కడ వున్నారా? అనే ఆశతో కనుగొనేలా చేస్తుంది.

ఈ ప్రశ్న పట్ల మీ సమాధానం చేసే ఉద్యోగానికి మంచికి సంబంధం వుండేలా.. మంచిని ఎలా విభజించి బేరీజు వేసుకోవాలనే విషయాన్ని మీ నుంచి గ్రహించేందుకే ఈ ప్రశ్న వేస్తారని తెలుసుకోండి. ఈ ప్రశ్న కచ్చితంగా, మీరు అసాధారణ పనిని చేస్తారని హామీ ఇవ్వదు. కానీ ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఇస్తే.. మీ నైపుణ్యత ఉద్యోగ అవకాశాన్ని మిమ్మల్ని వరించేలా చేస్తుంది.
 
4. మీరు నిజంగా శ్రద్ధ వహిస్తున్న ప్రశ్నని అడగండి.
కొన్నిసార్లు అభ్యర్థులు వారి ఇంటర్వ్యూలో ఆకట్టుకోవడానికి ప్రయత్నించడానికి ఒక అదనపు అవకాశంగా ప్రశ్నలను అడగడానికి కొత్త మలుపును ఉపయోగిస్తారు. సహాయం కోసం రూపొందించిన ప్రశ్నలకు బదులుగా వాటిని బాగా ప్రతిబింబించేలా రూపొందించిన ప్రశ్నలను అడగడం చేస్తుంటారు. అవి ఆలోచనాత్మకంగా వుంటాయి. ఉద్యోగంపై శ్రద్ధ పెట్టే వారు వాటిని బాగా గుర్తించవచ్చు. అందుచేత ఇంటర్వ్యూ చేసే వ్యక్తి వేసే ప్రశ్నను గమనించి.. ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని ఆకట్టుకునే విధంగా రెండు వైపులా వీధులుంటాయనే రీతిలో సమాధానం ఇవ్వాలి.

ఉద్యోగం, యజమాని, మేనేజర్‌లను అంచనా వేయడం అవసరం. అందుచేత ఇంటర్వ్యూ ముందు కొంత సమయం వెచ్చించి.. మానసికపరంగా వేసే ప్రశ్నలకు ప్రీపేర్ అవ్వాలి. అలాగే ఈ విషయాల గురించి మీ ఇంటర్వ్యూయర్ సమాధానాలపై మాత్రం ఆధారపడకూడదు. మీరు మీ నెట్‌వర్క్‌లో వున్న ప్రజలందరితో మాట్లాడటం ద్వారా మీరు శ్రద్ధ వహించాలి. కంపెనీ సంస్కృతి లేదా నిర్వాహకుడికి లోపల ఉన్న స్కూప్, గ్లాస్డోర్ వంటి ప్రదేశాలలో ఆన్లైన్ సమీక్షలను చదవాలి. అక్కడ పనిచేసే ఇతర వ్యక్తులతో మాట్లాడటం వంటివి చేయాలి.
 
5. తదుపరి దశల కోసం మీ ప్లానింగ్ ఏమిటి?
ఇది ప్రాథమిక లాజిస్టిక్స్ ప్రశ్న. కానీ అడగడానికి ఉపయోగపడుతుంది. తదుపరి సమీక్షలు, మేనేజర్, నిర్వాహకులు, యజమానులతో చేసే ప్రణాళికలకు సిద్ధం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్రశ్న అడగడం ద్వారా యజమానితో ప్రణాళికలను చెక్ చేసుకునేందుకు సులభతరం అవుతుంది.

ప్లానింగ్‌ గురించి వాటి వివరాలను ఈ-మెయిల్ చేసి చెప్పండి. ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలో నిక్కచ్చిగా వున్నానని, కంపెనీతో భాగస్వామ్యం చేసేందుకు సమయాన్ని కేటాయిస్తానని.. మీ ఆసక్తిని కనబరచండి. అంతేగాకుండా ఇంటర్వ్యూ చేసే వ్యక్తులతో సంభాషించేందుకు ఆసక్తి చూపెట్టేలా సమాధానం ఇవ్వండి.దీనిపై మరింత చదవండి :