మంగళవారం, 28 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 23 ఏప్రియల్ 2018 (13:11 IST)

కెరీర్‌పై వచ్చే యేడాది కీలక నిర్ణయం తీసుకుంటా : యువరాజ్ సింగ్

భారత డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన క్రికెట్ కెరీర్‌పై వచ్చే యేడాది కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రకటించారు. అదేసమయంలో అప్పటివరకు క్రికెట్ ఆడుతానని తెలిపారు.

భారత డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన క్రికెట్ కెరీర్‌పై వచ్చే యేడాది కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రకటించారు. అదేసమయంలో అప్పటివరకు క్రికెట్ ఆడుతానని తెలిపారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 2019 ప్రపంచకప్ వరకూ తాను భారత జట్టు తరపున ఆడాలనుకుంటున్నట్టు చెప్పారు. 2019 చివర్లోనే తన అంతర్జాతీయ కెరీర్‌పై నిర్ణయం తీసుకుంటానని తెలిపాడు. యువరాజ్ సింగ్ చివరిగా 2017లో భారత జట్టు తరపున వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. రెండు దశాబ్దాలుగా దేశం కోసం ఆడుతున్న తాను ఏదో ఒక రోజు విరామం తీసుకుంటానని తెలిపారు. 
 
"2000 సంవత్సరం నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నా. ఎవరైనా సరే ఏదో ఒక రోజు రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే. 2019 తర్వాత నేను కూడా కచ్చితంగా నిర్ణయం తీసుకుంటా" అని చెప్పాడు. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ లీగ్‌లో యువరాజ్ సింగ్ కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు తరపున ఆడుతున్న విషయం తెల్సిందే.