శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : బుధవారం, 18 ఏప్రియల్ 2018 (09:34 IST)

మళ్లీ కన్నుగీటిన ప్రియా ప్రకాష్ వారియర్... యాడ్ వీడియో వైరల్

కన్నుగీటడంలో దిట్ట అనే ముద్ర వేసుకున్న ప్రియా వారియర్.. మరోసారి కన్నుగీటింది. ఈసారి యాడ్ ఫిలిమ్ కోసం కన్నుగీటింది. ''ఒరు అదార్‌ లవ్‌'' సినిమా పాటలో కన్నుకొట్టి యావత్‌ యువతను మంత్రముగ్ధులను చేసిన మలయాళ

కన్నుగీటడంలో దిట్ట అనే ముద్ర వేసుకున్న ప్రియా వారియర్.. మరోసారి కన్నుగీటింది. ఈసారి యాడ్ ఫిలిమ్ కోసం కన్నుగీటింది. ''ఒరు అదార్‌ లవ్‌'' సినిమా పాటలో కన్నుకొట్టి యావత్‌ యువతను మంత్రముగ్ధులను చేసిన మలయాళ నటి ప్రియాప్రకాశ్‌ వారియర్‌ మరోసారి కన్నుగీటి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు సినిమా కోసం కన్ను కొట్టిన ప్రియ ప్రకాశ్, ఈ సారి చాక్లెట్ యాడ్ కోసం కన్నుగీటింది.
 
ఈ యాడ్‌లో ప్రియ క్రికెట్‌ గ్రౌండ్‌లో కూర్చొని చాక్లెట్‌ తింటూ ఉండగా, ఆమె దగ్గరకి ప్రాక్టీస్ చేస్తున్న ఆటగాళ్లు విసిరిన బంతి వస్తుంది. దానిని తనకు ఇవ్వమని ఆటగాడు అడుగుతాడు. విసిరేసిన వస్తువును తాను ముట్టుకోనని ప్రియా వారియర్ సమాధానం చెప్తోంది. దీంతో తనకు చాలా ఎగస్ట్రాలున్నాయని ఆటగాడు మండిపడితే.. అది ఫ్రీ కదా అంటూ కన్నుగీటుతుంది. ఈ యాడ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 
 
మలయాళం, హిందీ సహా ఆరు భాషల్లో విడుదలవుతున్న ఈ ప్రకటన వీడియోను పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే లక్షమంది వీక్షించారు. ఒరు ఆదర్‌ లవ్‌ సినిమా జూన్‌లో విడుదల కానుంది.