బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : ఆదివారం, 8 ఏప్రియల్ 2018 (11:16 IST)

ప్రియా వారియర్ ఆ సినిమాలో 20 నిమిషాలే కనిపిస్తుందట.. అందుకే రీషూట్?

''ఒరు అదార్ లవ్'' సినిమా కంటే ఆ సినిమాలోని ఓ పాటలో కన్నుగీటి సెలెబ్రిటీగా మారిపోయింది. చిన్న వీడియో ద్వారా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రియా వారియర్ కోసం ఒరు అదార్ లవ్‌లో మరిన్ని స

''ఒరు అదార్ లవ్'' సినిమా కంటే ఆ సినిమాలోని ఓ పాటలో కన్నుగీటి సెలెబ్రిటీగా మారిపోయింది. చిన్న వీడియో ద్వారా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రియా వారియర్ కోసం ఒరు అదార్ లవ్‌లో మరిన్ని సన్నివేశాలను పొందుపరుచనున్నారు. ఒరు అదార్ లవ్‌లో వాస్తవానికి ఈ చిత్రంలో ప్రియా వారియర్ 20 నిమిషాలు మాత్రమే వుంటుందట. 
 
కానీ ప్రియకు కన్నుగీటడం ద్వారా వచ్చిన పాపులారిటీతో వివిధ భాషల్లో డబ్బింగ్ హక్కుల కోసం నెలకొన్న పోటీని దృష్టిలో పెట్టుకుని ఆ సినిమాలో ప్రధాన హీరోయిన్‌గా చూపుతూ మరిన్ని సన్నివేశాలు, పాటలు చేర్చేందుకు సినీ యూనిట్ భావిస్తోంది. 
 
''ఒరు అదార్ లవ్'' చిత్రంలోని 40 శాతం భాగాన్ని రీషూట్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ధ్రువీకరించింది. మరో నాలుగు నెలల తరువాతే సినిమా విడుదల ఉంటుందని సినీయూనిట్ స్పష్టం చేసింది. ప్రియా వారియర్‌కు ఉన్న క్రేజ్‌ను ఇలా క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు.