మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 4 ఏప్రియల్ 2018 (13:36 IST)

నాజూగ్గా తయారవుతున్న పదహారణాల తెలుగమ్మాయి (వీడియో)

'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో మంచి పేరు దక్కించుకున్న హీరోయిన్ అంజలి. పదహారణాల తెలుగమ్మాయి ఎలా ఉంటుందంటే హీరోయిన్ అంజలిని చూపిస్తే సరిపోతుందని ప్రతి ఒక్కరూ అంటుంటారు.

'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో మంచి పేరు దక్కించుకున్న హీరోయిన్ అంజలి. పదహారణాల తెలుగమ్మాయి ఎలా ఉంటుందంటే హీరోయిన్ అంజలిని చూపిస్తే సరిపోతుందని ప్రతి ఒక్కరూ అంటుంటారు. ఇట్టే ఆకట్టుకునే ముఖారవిందం ఆమె సొంతం. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో ఇప్పటివరకు దాదాపు 30కి పైగా సినిమాల్లో ఈమె నటించింది. 
 
అయితే, ప్రతి సినిమాలోనూ ఆమె బొద్దుగా ముద్దుగా కనిపిస్తూ వచ్చింది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఆమె జిమ్‌లో తెగ వర్కౌట్లు చేస్తోంది. అందుకు కారణం... కార్తీక్ సుబ్బురాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించనున్న చిత్రం కోసమే ఆమె ఇలా నాజూగ్గా తయారవుతోందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల కాలేదు.