మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 16 మార్చి 2018 (18:39 IST)

''బిచ్చగాడు''తో ఆ సీన్ గోవిందా..? ( కాళి తమిళ ట్రైలర్)

''బిచ్చగాడు'' సినిమా తెలుగులో విడుదలై అనూహ్య విజయం సాధించింది. డబ్బింగ్ సినిమాగా తెలుగులో సక్సెస్ అయిన చిత్రాల్లో బిచ్చగాడు ముందువరుసలో నిలిచాడు. అయితే కొత్తదానికి పట్టం కట్టిన తెలుగు సినీ ప్రేక్షకులు

''బిచ్చగాడు'' సినిమా తెలుగులో విడుదలై అనూహ్య విజయం సాధించింది. డబ్బింగ్ సినిమాగా తెలుగులో సక్సెస్ అయిన చిత్రాల్లో బిచ్చగాడు ముందువరుసలో నిలిచాడు. అయితే కొత్తదానికి పట్టం కట్టిన తెలుగు సినీ ప్రేక్షకులు.. ఆ తర్వాత బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ నటించిన చిత్రాలపై పెద్దగా ఆసక్తి చూపలేదు. బేతాళుడు, యముడు సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ అయినా అంతగా ఆకట్టుకోలేదు. 
 
ఇక తాజాగా తమిళంలో విడుదలైన విజయ్ ఆంటోనీ సినిమా ''కాళి''ని.. తెలుగులో కొనేవారు కరువయ్యారు. దీంతో కాళి సినిమాను తమిళం వరకే పరిమితం అయ్యారు. తమిళంలో హిట్ కొడితే మాత్రం తెలుగులోకి అనువాదమయ్యే అవకాశాలు వున్నాయి. 
 
మరోవైపు విజయ్ ఆంటోనీ లేటెస్ట్ మూవీగా వచ్చే కాళి సినిమాలో సీతీమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా కోసం అంజలి స్లిమ్‌గా తయారైంది. తమిళంలో ఈ సినిమాకు మంచి సక్సెస్ లభిస్తే.. తెలుగులోకి డబ్బింగ్ కావొచ్చునని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.