శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 13 మార్చి 2018 (11:15 IST)

ఎన్టీఆర్ భార్య ఎవరో తెలుసా?

కోట్లాది మంది తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని ఆయన తనయుడు, సినీ హీరో బాలకృష్ణ నటిస్తున్నారు. తేజ దర్శకత్వం వహించనున్నారు.

కోట్లాది మంది తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని ఆయన తనయుడు, సినీ హీరో బాలకృష్ణ నటిస్తున్నారు. తేజ దర్శకత్వం వహించనున్నారు. అయితే, ఈ సినిమాలో బాలకృష్ణ క‌థ‌నాయ‌కుడిగా న‌టించ‌డ‌మే కాకుండా నిర్మాత‌గా కూడా మారుతున్నారు. 
 
ఈ చిత్రంలోని పలు పాత్రలకు నటీనటులను ఎంపిక చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ సతీమణి క్యారెక్టర్‌కు కూడా హీరోయిన్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ క్యారెక్టర్ కోసం విద్యాబాలన్‌ను చిత్రబృందం ఎంపిక చేసిందనీ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
ఇటీవలే ఈ సినిమా కోసం సక్సెస్‌ఫుల్ హీరో శర్వానంద్‌ను చిత్రబృందం సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. యంగ్ ఎన్టీఆర్ రోల్‌లో నటించాలని శర్వాను కోరినట్టు సమాచారం. అయితే ఈ రెండు పాత్రలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. కాగా, ఈ చిత్రం వచ్చే యేడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తోంది.