మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 12 మార్చి 2018 (13:06 IST)

దేశానికే రోల్ మోడల్.. తెలంగాణ సర్కారుపై గవర్నర్ ప్రశంసల జల్లు

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగం చేశారు. బంగారు తెలంగాణ సాధన కోసం ఈ అసెంబ్లీ సమావేశాలు దోహదపడుతాయని భావిస్తున్నట్లు గవర్నర్ తన ప్రసంగంలో ప

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగం చేశారు. బంగారు తెలంగాణ సాధన కోసం ఈ అసెంబ్లీ సమావేశాలు దోహదపడుతాయని భావిస్తున్నట్లు గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి తెలంగాణ సర్కారు కృషి చేస్తోందని.. తెలంగాణ సర్కారు పథకాలు తెలంగాణ సాధనకు తోడ్పడుతాయని.. మూడున్నరేళ్లలో అభివృద్ధి వైపు తెలంగాణ దూసుకుపోతుందని కొనియాడారు. ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతుంది. 
 
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం సఫలమైంది. దేశంలో అత్యంత పిన్న వయసున్న తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, ప్రశంసలు లభించాయని.. రైతులకు సాగునీరు అందించేందుకు తెలంగాణ సర్కారు పలు పథకాలు చేపట్టిందని తెలిపారు. 
 
ఇంటింటికి తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ చేపట్టాం. 95శాతం మిషన్ భగీరథ పనులు పూర్తి అయినాయని చెప్పారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాతో తమ సర్కారు రికార్డు సృష్టించిందని చెప్పారు. 35.3 లక్షల మంది రైతులకు లక్షలోపు రుణమాఫీ చేసినట్లు గవర్నర్ వెల్లడించారు.